టీవీ యాంకర్ ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అశ్విన్ బాబు. రాజుగారి గది సినిమాతో హిట్ కట్టాడు. ఆ తర్వాత దాని సీక్వెన్స్ కూడా రెండు సినిమాలు చేశాడు. తాజాగా, హిడింబ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో అశ్విన్ సరసన నందితా శ్వేత నటించింది. ఈ సినిమాకి అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకున్నది లేదు.
చెప్పుకోదగిన ఓపెనింగ్స్ ఈ మూవీకి రాలేదు. మరీ దారుణం కాదు, కానీ మిక్స్డ్ టాక్ వినపడింది. అయితే, వచ్చేవారం ఏదైనా సినిమా విడుదలైతే, ఈ మూవీ థియేటర్ లలో కూడా కనిపించదు. అలాంటి ఈ సినిమా విషయంలో మేకర్స్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీని కన్నడలో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో, ఈ మూవీ పై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఇక్కడే ఈ మూవీని పెద్దగా ఎవరూ చూడలేదు, ఇక, అక్కడ ఎవరు చూస్తారు అంటూ కౌంటర్లు వేస్తున్నారు.
ఇక్కడ సూపర్ హిట్ అయిన విరూపాక్ష లాంటి సినిమానే వేరే లాంగ్వేజ్ లో కలెక్షన్లు రాబట్టలేదు. అలాంటిది… తెలుగులోనే హిట్ కాని హిడింబ సినిమాను కన్నడలో విడుదల చేయడం పెద్ద వృథా ప్రయాస అనే భావన చాలా మందిలో కలగడం విశేషం.
కాగా, హైదరాబాద్ సిటీలో మహిళలు అదృశ్యమవుతుంటారు. ఈ కేసును చేధించే స్పెషల్ ఆఫీసర్లుగా నందిత శ్వేత, అశ్విన్ బాబు అపాయింట్ అవుతారు. క్రిమినల్ మహిళలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు. స్పెషల్ ఆఫీసర్లు ఆ మహిళల కిడ్నాప్ మిస్టరీని ఎలా చేధించారనే నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. మరి, ఈ మూవీ కన్న ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.