బిగ్ బాస్ 4: ఈ వారం హౌస్ నుంచి బయటికి వెళ్లడానికి నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీళ్లే.. గంగవ్వ కూడా నామినేట్

nominated contestants to be eliminated in first week in bigg boss 4

సూపర్.. బిగ్ బాస్ హౌస్ అంటే ఇలా ఉండాలి. తొలి రోజే బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ చేశారు. ఇదే స్పిరిట్ తో కంటెస్టెంట్లు ఉంటే.. టీఆర్పీ రేటింగ్స్ దద్దరిల్లిపోవాల్సిందే.

nominated contestants to be eliminated in first week in bigg boss 4
nominated contestants to be eliminated in first week in bigg boss 4

మొదటి రోజే హౌస్ లో గొడవలు ప్రారంభం అయ్యాయి. ముందుగా సూర్య కిరణ్, మొనల్ గజ్జర్ మధ్య చిన్న గొడవ.. ఆ తర్వాత అది పెద్దగా అవుతుంది అని అనుకున్నారు కానీ.. దాన్ని సూర్య కిరణ్ మధ్యలోనే తుంచేశాడు. అయితే.. ఇక్కడ సూర్య కిరణ్ గురించి ఓ విషయం మాట్లాడుకోవాలి మనం.

సూర్య కిరణ్.. ప్రతి దాంట్లో వేలు పెడుతున్నాడు. అది మంచికా.. చెడుకా అనేది పక్కన పెడితే.. ఆయన ఒక బాధ్యత తీసుకొని ప్రతి విషయంపై ఒక సమాధానం చెబుతూ.. అందరినీ కూల్ చేద్దామని అనుకుంటున్నాడా? లేక ఇదంతా గేమ్ లో పార్టా? అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాలి.

ఇక.. కరాటే కళ్యాణి, జోర్దార్ సుజాత మధ్య ఒక రేంజ్ ఫైట్ జరిగింది.వాళ్లది కూడా చిన్న గొడవే కానీ.. పెద్దదయింది. ఏం చేస్తాం.. నామినేషన్లలో ఆ గొడవను ఇంకాస్త పెద్దది చేసుకున్నారు. కరాటే కళ్యాణి గురించి తెలిసిందే కదా. ఆమె అరవడం.. ఎందుకు అలా అరుస్తున్నారు అంటే నేనింతే.. నా గొంతు ఇంతే అనడం.. మొత్తానికి తెలుగు ప్రేక్షకులకు అదేనండి.. బిగ్ బాస్ అభిమానులకు ఫుల్లు వినోదం దొరికింది ఇవాళ.

బిగ్ బాస్.. రోజూ నువ్వు ఇలాగే ప్లాన్ చేసుకో. టీఆర్పీ రేటింగ్ ఎందుకు పెరగదో చూద్దాం. ఇంతకీ ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి నామినేట్ అయిన వాళ్లు ఎవరో తెలుసా?

సూర్య కిరణ్, అభిజిత్, అఖిల్ సార్థక్, మెహబూబ్, దివి, సుజాత, గంగవ్వ… అన్నట్టు గంగవ్వను కూడా నామినేషన్ చేశారు. అంతేలే.. తమ్ముడు తమ్ముడే.. గేమ్ గేమే.