బిగ్ బాస్ షో కొన్ని బంధాలను కలుపుతుంది. కొన్ని బంధాలను విడగొడుతుంది. అలా బిగ్ బాస్ ఇంట్లో ఏర్పడిన బంధాలు కొన్ని చిరకాలం కొనసాగుతూనే ఉంటాయి. అలా ఈ నాల్గో సీజన్‌లో కంటెస్టెంట్లలో చాలా మంది స్నేహితులుగా మారారు. ఎన్నో గ్రూపులు ఏర్పడ్డాయి. అందులో నోయల్ హారిక అభిజిత్ లాస్య గ్యాంగ్ ఒకటి. అందులోనూ మరీ ముఖ్యంగా హారిక నోయల్ మరింత సన్నిహితులుగా మారారు.
నోయల్‌ను కుటుంబ సభ్యుడిగా భావిస్తోన్న హారిక ఇంట్లో ఎంత ఎమోషనల్ అయిందో అందరికీ తెలిసిందే. నోయల్‌కు ఆరోగ్యం బాగా లేనప్పుడు, వెళ్లిపోతోన్నాడని తెలిశాక.. ఇలా ప్రతీ సందర్భంలోనూ నోయల్ కోసం హారిక కన్నీరు పెట్టేసుకుంది. అలా హారిక నోయల్ బంధం బయటకు వచ్చాక కూడా కొనసాగుతూనే ఉంది. ఇక ముందే నోయల్ బయటకు రావడంతో తన మద్దతును హారిక, అభిజిత్‌లకే ఇచ్చాడు.
తాజాగా హారిక, నోయల్‌లు కలుసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నోయల్ ఓ వీడియోను షేర్ చేశాడు. అది కూడా హారిక అకౌంట్ నుంచే. హారిక ఫోన్ కొట్టేశాను.. ఆమె ఈ ఫోన్ కోసం వెతుకుంది..కానీ ఆమెకు దొరకదు.. ఇకపై హారిక సోషల్ మీడియాలో ఖాతాలో ఏం పోస్ట్‌లు పెట్టకపోయినా అప్డేట్లు ఇవ్వకపోయినా ఏమీ అనుకోకండి.. ఓ ఐదారు రోజుల తరువాత ఇస్తాను ఓకేనా? అంటూ నోయల్ వీడియోను షేర్ చేశాడు.