లాస్య నిన్నటి నుంచి వార్తల్లో హైలెట్ అవుతూనే వస్తోంది. లాస్యటాక్క్స్ అనే తన యూట్యూబ్ చానెల్ హ్యాక్ అయిందంటూ వీడియో రిలీజ్ చేయడంతో మరింత రచ్చగా మారింది. మొన్న సాయంత్రం నుంచి లాస్య టాక్స్ అనే యూబ్యూట్ చానెల్ కనిపించకపోవడం, మిలియన్ల వ్యూస్ కొట్టిన వీడియోలన్నీ ఎక్కడికో వెళ్లిపోయాయి. యూట్యూబ్ చానెల్ నుంచి లైవ్ వెళ్లిపోతోందని, ఇలా కొంత మంది తన సన్నిహితులు చెప్పడంతో విషయం తెలిసిందంటూ లాస్య పేర్కొంది.
ఈ మేరకు లాస్య ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చి అసలు విషయం చెప్పింది. నా అకౌంట్ హ్యాక్ అయిందని అందరూ చెప్పే వరకు కూడా నాకు తెలియదు. మా టీం శ్రమిస్తోంది.. నా అకౌంట్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని చెప్పుకొచ్చింది. అయితే కాస్త సమయం పడుతుందని చెప్పారు. మళ్లీ తన యూట్యూబ్ చానెల్, వీడియోలు తిరిగి వస్తాయనే చెబుతున్నారు.. వచ్చాక మళ్లీ వీడియోను చేస్తానని చెప్పింది.
అయితే ఇదే విషయంపై నోయల్ మాట్లాడాడు. లాస్య అకౌంట్ హ్యాక్ అయిందట.. ఈ విషయం తెలిశాక ఎంతో హ్యాపీగా ఫీలయ్యాను.. అసలు ఎవరి అకౌంట్లు హ్యాక్ అవుతాయి.. ఓ రేంజ్‌లో ఉన్న వాళ్ల అకౌంట్లు మాత్రమే అవుతుంటాయి.. తోపు కాబట్టే హ్యాక్ చేశారు.. వాళ్లకు నీ స్థాయి తెలుసు కాబట్టే హ్యాక్ చేశారు.. నా అకౌంట్ కూడా ఒకప్పుడు హ్యాక్ అయింది.. ఇందులో నీకు సూపర్ సీనియర్‌ని.. నువ్ ఇలాంటి అకౌంట్లు కొన్ని వందలు క్రియేట్ చేయగలవు.. నీ అకౌంట్ నీకు తిరిగి వస్తుందని లాస్యకు భరోసా ఇచ్చాడు నోయల్.