“NTR30” విషయంలో వారు టెన్షన్ పడక్కర్లేదా.!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్న పలు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో టాలీవుడ్ నుంచి ఉన్న సినిమాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఈ భారీ సినిమాల లిస్ట్ లో మాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివతో ప్లాన్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కూడా ఒకటి.

అయితే ఈ సినిమా ప్రస్తుతానికి ఎన్టీఆర్ 30గా పిలవబడుతుంది. మరి ఈ భారీ సినిమా అయితే మొక్కుబడి అప్డేట్స్ ఇస్తున్నారు. అలాగే మరోపక్క సినిమా నత్త నడకనే కనిపిస్తుంది. దీనితో అభిమానులు సినిమాలో అసలు ఎలాంటి ప్రోగ్రెస్ లేదని చాలా టెన్షన్ పడుతున్నారు.

దీనితో సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారని సోషల్ మీడియాలో పెద్ద రచ్చే చేస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం ఫ్యాన్స్ కి ఎలాంటి కంగారు అక్కర్లేదట. ఈ చిత్రం అనుకున్న సమయానికే స్టార్ట్ అయ్యి అనుకున్నట్టే వచ్చే ఏడాది ఉగాది కానుకగా రిలీజ్ అవుతుందని ఆ ప్లానింగ్ లోనే చిత్ర యూనిట్ పక్కాగా ఉన్నారని ఇండస్ట్రీ టాక్.

మరి ఈ భారీ సినిమాలో ఎన్టీఆర్ తో పాటుగా పలువురు బిగ్ స్టార్స్ కనిపించనుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ప్రస్తుతం అయితే ఈ సినిమా ఫిబ్రవరి రెండో వారం లో ముహూర్తం స్టార్ట్ చేసుకోనుండగా నెలాఖరు నుంచి షూటింగ్ స్టార్ట్ కానున్నట్టుగా న్యూస్. అలాగే ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ అనే కొత్త బ్యానర్ లు రెండు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.