‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌కి అర్జెంటుగా కమర్షియల్ హీరోయిన్ అయిపోవాలని వుందట. కానీ, ఆమెకు గ్లామర్ పాత్రలు అస్సలు రావడం లేదట. ‘సీతారామం’లో సీత పాత్రలో ఆమెని చూశాకా, ఆ తరహా పాత్రలు మాత్రమే మృణాల్‌ని వెతుక్కుంటూ వస్తున్నాయని వాపోతోంది.
కానీ, తనకేమో పక్కా గ్లామరస్ రోల్స్ చేయాలని వుందట. గ్లామర్ అంటే తనకెంతో ఇష్టమని చెబుతోందీ క్యూట్ బ్యూటీ. అయినా అంత తొందరెందుకు ఈ ముద్దుగుమ్మకి. అవకాశాలు రావడమే గొప్ప. అందులోనూ ఛాలెంజింగ్ రోల్స్ రావడం ఇంకా గొప్ప.
అలాంటిది విచిత్రంగా కమర్షియల్ రోల్స్ కావాలంటోందేంటీ.? అని ఆడియన్స్ అవాక్కవుతున్నారు. అయినా అంత తొందరెందుకు.! వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటే కావల్సిన స్టార్‌డమ్ దక్కించుకుంటే ఆ తర్వాత ఏం చేసినా చెల్లిపోతుంది కదా.
ఊహూ.! కనీసం స్పెషల్ సాంగ్‌లోనైనా నటించేయాలని వువ్విళ్లూరుతోందట మృణాల్ ఠాకూర్. కానీ ఎవ్వరూ ఆ ఛాన్స్ ఇవ్వడం లేదట పాపం మృణాల్‌కి. ప్రస్తుతం నాని 30లో మృణాల్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.