నయనతార ఏ రోజు రెమ్యూనరేషన్ గురించి మాట్లాడలేదు..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎన్నో అంచనాల నడుమ నేడు గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాగా రీమేక్ చేశారు.మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని కొనిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్, సూపర్ గుడ్ ఫిలిం బానర్ పై ఆర్ బి చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి ఆర్.బి చౌదరి ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆర్పీ చౌదరి మాట్లాడుతూ తాను ఎప్పటినుంచో చిరంజీవి గారితో కలిసి సినిమా చేయాలని భావించాను అయితే ఆయనతో సినిమా చేసే అవకాశం గాడ్ ఫాదర్ సినిమాతో కలిగిందని మొదటిసారి చిరంజీవితో సినిమా చేయటం చాలా ఆనందంగా ఉందని ఈయన వెల్లడించారు.రామ్ చరణ్ ఈ సినిమా గురించి చెప్పి మీరు తెలుగు రీమేక్ హక్కులను కొనుగోలు చేయండి అంటూ ఈ సినిమా నిర్మాణంలో నాకు భాగస్వామ్యం కల్పించారని ఆర్ బి చౌదరి పేర్కొన్నారు.

సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని ఈ సినిమాలో మూడు సన్నివేశాలలో ప్రేక్షకులలో సీట్లలో కూర్చోరనీ ఈయన తెలిపారు.ఇక ఇందులో నయనతార పాత్ర చాలా కీలకంగా ఉంది. డైరెక్టర్ మోహన్ రాజా నయనతారని ఈ సినిమాలో నటించడానికి ఒప్పించారు. ఇక లాస్ట్ డే సన్నివేశంలో నటించడం కోసం నయనతార చెన్నై నుంచి వచ్చి కేవలం ఒక్క గంటలో షూట్ పూర్తి చేసుకొని వెళ్లిపోయారు. నయనతార నటన పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తారు. ఆమె క్రమశిక్షణ శ్రద్ధ నాకు చాలా బాగా నచ్చాయని ఆర్ బి చౌదరి పేర్కొన్నారు.ఇక రెమ్యూనరేషన్ విషయంలో నయనతార ఏ రోజు కూడా తమని డబ్బు అడగలేదని చివరి రోజు షూటింగ్ అప్పుడు కూడా తనకు బ్యాలెన్స్ ఉండగా తను డబ్బు అడగలేదని తెలిపారు. తర్వాత మేమే తన బ్యాలెన్స్ క్లియర్ చేశామని ఈ సందర్భంగా ఆమె రెమ్యూనరేషన్ గురించి ఆర్.బి చౌదరి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.