శ్రీలీలపై నితిన్‌ సంచలన వ్యాఖ్యలు!?

శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్‌ లో ఒక సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది, దానికితోడు ఆమె వరస సినిమాలు ఒప్పుకుంటోంది. అందువలన ఆమె చాలా బిజీ అయిపోవటమే కాకుండా, ఒక సినిమాకి ఒకరోజు కాదు, కొన్ని గంటలు కేటాయిస్తే అదే పెద్ద విషయం అన్నట్టుగా అయిపొయింది. ఇదే విషయాన్ని నటుడు నితిన్‌ కూడా చెబుతున్నాడు. నితిన్‌, శ్రీలీల జంటగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ సినిమా డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

వక్కంతం వంశీ ఈ చిత్రానికి దర్శకుడు, నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి నిర్మాత. శ్రీలీలతో చేస్తున్నప్పుడు మీకు ఎంటువంటి ఛాలెంజ్‌ ఎదురైంది అని హీరో నితిన్‌ ని అడిగితే, అతని సమాధానం అందరికీ నవ్వు తెప్పించింది. ఆమె మా సినిమాకి ఎన్ని గంటలు కేటాయిస్తుంది, షూటింగ్‌ కి ఎప్పుడు వస్తుంది అనేదే పెద్ద ఛాలెంజ్‌ అని సమాధానం చెప్పాడు నితిన్‌. ‘ఆమె డేట్స్‌ ఇస్తే చాలు అదే మాకు ఛాలెంజ్‌.

ఒకవేళ డేట్స్‌ ఇచ్చినా ఎన్నిగంటలు ఇస్తుంది రెండు గంటలా, మూడు గంటలా, ఒకవేళ రెండు గంటలు మాత్రమే మా షూటింగ్‌ కి కేటాయిస్తుంది అని తెలిస్తే, ఆ రెండు గంటలకి సరిపడా ఎటువంటి సన్నివేశాలు రాసుకోవాలి, దానికి ఎలా ప్రిపేర్‌ అవ్వాలి అన్నదే మా ఛాలెంజ్‌,’ అని నితిన్‌ సెటైరికల్‌ గా చెప్పాడు. ఆమె డాన్సులు చాలా బాగా చేసిందని, అందుకోసం తాను కూడా బాగా డాన్సులు చెయ్యాల్సి వచ్చిందని చెప్పాడు నితిన్‌.

‘ఆమె డాన్సులకి నేను మ్యాచ్‌ అయ్యేట్టు చెయ్యాలి అంటే నేను కూడా కొంచెం ప్రిపేర్‌ అవ్వాలి కదా, లేదంటే ఏంటి నితిన్‌ డాన్సుల్లో వెనక పడ్డాడు అని మీరే అంటారు, అందుకని ఆమె డాన్సులకి మ్యాచ్‌ అయ్యేట్టు నేను కూడా డాన్సులు చేసాను,’ అని చెప్పారు నితిన్‌. మరి శ్రీలీల డేట్స్‌ అంత ఇబ్బందిగా వుండి, ఆమె దొరకడమే కష్టం అనుకున్నప్పుడు ఆమెనే మళ్ళీ నితిన్‌ తదుపరి సినిమాలో కూడా పెట్టుకున్నారు ఎందుకు? ఆ సినిమాలో ముందు రష్మిక అనుకున్నారు, కానీ ఆమె తేదీలు ఇవ్వడం కష్టం అయిందని, శ్రీలీలని పెట్టుకున్నారు.

ఈమె కూడా చాలా బిజీ అయిపొయింది అంటున్నారు కదా, అన్నదానికి నితిన్‌ సమాధానం వింటే షాక్‌ అవుతారు. ‘అప్పుడు మా’ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ దర్శకుడుకి కూడా చెప్పాము, వినలేదు, అనుభవించాం, అలాగే నా రాబోయే సినిమా దర్శకుడు వెంకీ కి కూడా చెప్పాము, అతను కూడా వినిపించుకోలేదు, మేము అనుభవించిన బాధ అతను కూడా అనుభవిస్తే అప్పుడు తెలుస్తుంది’ అని నితిన్‌ సమాధాం ఇచ్చి, అందరినీ నవ్వించాడు.