నితిన్ తమన్నా లో చూసింది అదే.. అందుకే టబు ని కాదన్నాడట..?

యంగ్ హీరో నితిన్ భీష్మ తో భారీ సక్సస్ ని అందుకున్నాడు. ఇదే ఊపుతో వరసగా సినిమాలు కమిటయ్యాడు. ఇప్పటికే రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న రంగ్ దే సినిమాలో నటిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సగానికి పైగా చిత్రీకరణ కంప్లీటయిన ఈ సినిమా లాక్ డౌన్ తో నిలిచిపోయింది. తాజాగా మళ్ళీ ఇటీవలే చిత్రీకరణ ప్రారంభం అయింది. అంతేకాదు 2021 సంక్రాంతికి థియోటర్స్ లో రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. కాగా ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.

అలాగే టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలోను ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాని సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నారట. కాగా నితిన్ ఒక బాలీవుడ్ సినిమాలో నటించేందుకు రీమేక్ హక్కులను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమానే హిందీలో సూపర్ హిట్ అయిన అంధాదున్.

ఈ సినిమాలో హీరో పాత్ర విపరీతంగా నచ్చడంతో ఆ పాత్ర తానే చేయాలని నితిన్ డిసైడయ్యాడు. హిందిలో యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన పాత్రలో నితిన్‌ నటించబోతున్నారు. మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతుండగా… శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై నితిన్ తండ్రి ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, సోదరి నికితా రెడ్డి నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో ఉన్న రెండు మేయిన్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ కోసం తెలుగులో చాలామందిని అనుకున్నారు. ఎట్టకేలకి హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటి నభా నటేష్, హిందీలో టబు చేసిన పాత్ర కి తమన్నా ని ఎంచుకున్నారు. వాస్తవంగా టబు నే తెలుగులోను నటిస్తుందన్న వార్తలు వచ్చాయి. కాని నితిన్ కి మాత్రం ఆపాత్రలో తమన్నా అయితే కరెక్ట్ అని భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి మరీ ఒప్పించాడట. అంతేకాదు టబు కంటే ఇప్పుడు టాలీవుడ్ లో తమన్నా కే ఎక్కువ క్రేజ్ ఉంది. ఇదే నితిన్ అంధాదున్ లో తమన్నా నటించే అవకాశం వచ్చేలా చేసిందంటున్నారు.