వైరల్‌ గా మారిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్‌’!

టాలెంటెడ్‌ యాక్టర్‌ నితిన్‌, బ్యూటీ డాల్‌ శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్‌’. రైటర్‌ డైరెక్టర్‌ వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. వరల్డ్‌ వైడ్‌గా డిసెంబర్‌ 8న ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే మేకర్స్‌ ప్రకటించారు. తాజాగా ఈ మూవీ షూట్‌లోకి యాంగ్రీమ్యాన్‌ రాజశేఖర్‌ జాయిన్‌ అయినట్లుగా మేకర్స్‌ ఓ వీడియోను అధికారికంగా విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ సినిమాలో రాజశేఖర్‌ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని మేకర్స్‌ చెబుతున్నారు. విడుదల చేసిన వీడియోలో కూడా అదే తెలుస్తోంది. ఆయన పాత్ర ఏంటి? ఎలా ఉండబోతుందనేది క్లారిటీ లేదు కానీ.. ఈ వీడియో చూస్తుంటే మాత్రం.. వక్కంతం వంశీ ఏదో గట్టిగానే ప్లాన్‌ చేసినట్లుగా అయితే తెలుస్తోంది. మ్యూజికల్‌ జీనియస్‌ హారిస్‌ జైరాజ్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడులైన ‘డేంజర్‌ పిల్లా..’ సాంగ్‌, నితిన్‌ లుక్స్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. నితిన్‌ ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రలో ఆకట్టుకోబోతున్నారని, కచ్చితంగా ఆయన అభిమానులనే కాదు, ప్రేక్షకులను కూడా నితిన్‌ తన బ్రిలియంట్‌ పెర్ఫామెన్స్‌తో మెప్పించనున్నారని మేకర్స్‌ చెబుతున్నారు.

క్యారెక్టర్‌ బేస్డ్‌ స్క్రిప్ట్‌తో.. ‘కిక్‌’ తర్వాత ఆ రేంజ్‌ జోన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోందని.. ఆడియెన్స్‌కి రోలర్‌ కోస్టర్‌లాంటి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తూ.. నవ్విస్తూనే సర్‌ప్రైజ్‌లతో సినిమా మెప్పించనుందని డైరెక్టర్‌ వక్కంతం వంశీ అన్నారు. శ్రేష్ఠ్‌ మూవీస్‌, ఆదిత్యమూవీస్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.