Nikhil sidharth : జులై 2 న కార్తికేయ 2 గా రాబోతున్న నిఖిల్ సిద్ధార్థ్…మరోసారి హిట్ అందుకుంటాడా….!

Nikhil Sidharth : శేఖర్ ఖమ్ముల హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తనకంటూ సొంత గుర్తింపుతో హీరో గా నిలదొక్కుకుంటున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఈ యువ హీరో పెళ్లి తర్వాత జోరు పెంచి వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. నిఖిల్ చేతిలో ఇపుడు ఐదారు సినిమాలు ఉన్నాయి.ప్రస్తుతం కార్తికేయ సినిమా సీక్వేల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.2014 లో చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో నిఖిల్ కు హీరోయిన్గా స్వాతి రెడ్డి నటించింది.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. తాజాగా ఈ మూవీ విడుదల తేదిని ప్రకటించారు. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్ర నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ ‘కార్తికేయ 2’ మూవీ ప్రొడ్యూసర్‌లలో ఒకరు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోమవారం (ఏప్రిల్ 11) ఈ సినిమా విడుదల తేదిని తెలియజేసారు . ‘కార్తికేయ 2’ జూలై 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు.

దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్‌ మీడియా వేదికగా షేర్ చేశారు. శ్రీకృష్ణుడు నివసించిన ద్వారక, ద్వాపర యుగానికి సంబంధించిన కథతో ఈ సినిమా వస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాశ్మీర్ ఫైల్స్లో అనుపమ్ ఖేర్ అద్భుతమైన నటన మనకు కనిపిస్తుంది.