బాక్సాఫీస్ : నిఖిల్ “స్పై” వరల్డ్ వైడ్ 3 రోజుల వసూళ్లు.!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా నుంచి పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రం “స్పై”. యంగ్ హీరో నిఖిల్ నటించిన ఈ చిత్రం అయితే కార్తికేయ 2 తర్వాత హిట్ కొడదాం అని ప్లాన్ చేసి రిలీజ్ చేసారు. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా మినహా మిగతా భాషల్లో అయితే రిలీజ్ అయినట్టు కూడా పెద్దగా ఎవరికీ తెలీదు.

కానీ తెలుగు వెర్షన్ లో అయితే మంచి వసూళ్లే వరల్డ్ వైడ్ ఈ చిత్రం అందుకుంటుంది. కాగా ఇపుడు మొత్తం మూడు రోజులు రన్ ని కంప్లీట్ చేసుకోగా ఈ చిత్రం ఈ మూడు రోజుల్లో మొత్తం 21.6 కోట్ల గ్రాస్ ని అయితే ఈ చిత్రం రాబట్టింది. దీనితో ఈ చిత్రం బాగానే రన్ అవుతుంది అని చెప్పొచ్చు.

ఇక వరల్డ్ వైడ్ అయితే సినిమా 18 కోట్ల మేర బిజినెస్ ని జరిపింది సో ఇంకా రాబట్టాల్సింది అయితే కొంత ఉంది. అది వస్తే హిట్ అని చెప్పొచ్చు. కాగా ఈ చిత్రానికి అయితే శ్రీచరణ్ పాకల సంగీతం అందించగా హీరోయిన్ గా యంగ్ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ నటించింది.

అలాగే తెలుగులో ఈమె ఈ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అలాగే రానా దగ్గుబాటి ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించాడు. ఇక ఈ సినిమా తర్వాత అయితే నిఖిల్ మరిన్ని పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. ఇక వాటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.