ఓటిటి : చప్పుడు లేకుండా రిలీజ్ అయిపోయిన నిఖిల్ “స్పై”..

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న యువ హీరోస్ లో ఇప్పుడు రొటీన్ గా పోతే లేదు అని కాస్త డిఫరెంట్ ట్రాక్ తీసుకొని అందులో సక్సెస్ అయ్యిన యంగ్ హీరోనే నిఖిల్ సిద్ధార్థ్. ఇప్పుడు నెమ్మదిగా పాన్ ఇండియా మార్కెట్ తెచ్చుకోవాలని చూస్తున్న నిఖిల్ రీసెంట్ గా నటించిన సినిమానే “స్పై”.

అయితే కార్తికేయ 2 లాంటి భారీ సక్సెస్ అనంతరం వచ్చిన ఈ చిత్రాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ పాన్ ఇండియా సినిమా రిలీజ్ గా అయితే తీసుకురావడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారు అప్పటికే నిర్మాతలకి హీరోకి ఏవో ఇష్యూస్ నడుస్తున్నాయి అని టాక్ కూడా ఉంది. కానీ ఎలాగో రిలీజ్ అయ్యింది.

నిఖిల్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ కూడా ఇది రాబట్టింది. కానీ ఆ హైప్ ని సినిమాలో కంటెంట్ దెబ్బేసింది. సినిమా ఏమాత్రం మెప్పించేలా లేకపోవడంతో మూడు రోజులు తర్వాత ఆడియెన్స్ మొహం చాటేశారు. దీనితో ప్లాప్ గానే మిగిలిపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఊహించని విధంగా ఓటిటి లో ప్రత్యక్షం అయ్యింది.

అసలు ఇలా వస్తున్నట్టుగా హీరోకి కూడా తెలిసి ఉండకపోవచ్చు. అలా చప్పుడు లేకుండా ఈ చిత్రం ఇపుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. కాగా ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ కన్నడ భాషల్లో ఇప్పుడు ప్రైమ్ లో ఉంది. ఇక ఈ చిత్రానికి దర్శకుడు గ్యారీ బి హెచ్ వర్క్ చేయగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది.