అనుపమ అంటే ఆ హీరోకి ఎందుకంత కసి?!

Anupama Paarameswaran

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో  సూపర్ హిట్ కొట్టిన సినిమా ‘కార్తికేయ’.  దేవుడిని సైన్సును మిక్సు చేసి విజయాన్ని సాధించిన ఈ సినిమా సీక్వెల్ ‘కార్తికేయ – 2 ‘  ప్రస్తుతం ప్లాన్ లో ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కి ముందు  ఒక షెడ్యూల్ కూడా షూటింగ్ జరువుకుంది ఈ సినిమా. మొత్తానికి వచ్చే నెలలో సెట్సు పైకి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది.’

Anupama Paarameswaran

ఈ సీక్వెల్ లో  నాని ‘గ్యాంగ్ లీడర్’  ఫేమ్  ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోందని సమాచారం. అయితే ఆమెది హీరోయిన్ పాత్ర, లేక మరో పాత్ర అనేది  క్లారిటీ లేదు. నిజానికి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ‘కార్తికేయ – 2 ‘ చిత్రం కోసం మొదట అనుకున్నారు. అనుపమ కూడా చేస్తానని కమిట్ అయింది. అయితే కరోనా ఎఫెక్ట్ దెబ్బకు డేట్సు కుదరక ఆమె  ఈ సినిమా నుండి తప్పుకుందని వార్తలు వచ్చాయి. కాదు.. కాధు యూనిటే వద్దనుకుందట. కారణాలు ఏమైనా.. అనుపమ ప్లేస్ లో అరుల్ మోహన్ ను ఎంపిక చేసుకున్నారట. అయితే..  అనుపమ ను మార్చడంలో పెద్ద తతంగమే జరిగిందట. దీని వెనుక ఓ హీరో కథ నడిపారని తెలిసింది.

అనుపమతో ఆ హీరోకి ఎందుకు చెడిందో.. ఏమో? ! కానీ ఈ సినిమా కోసం అనుపమని మాత్రం ఊహించని విధంగా తప్పించేశారుట! అనుపమ అంటే ఆ హీరోకి ఎందుకంత కసి అని ఇండస్ట్రీ అనుకుంటోంది. ఏమైనా తన మొదటి సినిమా ‘కార్తికేయ’తోనే డైరెక్టర్ గా మంచి డిమాండ్ తెచ్చుకున్నాడు చందు. చాలా గ్యాప్ తరువాత మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి మళ్ళీ ఫామ్ లోకి రావాలనే కసితో ఉన్నాడు.

ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. నిఖిల్ కూడా ఈ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్సు, ఓ కొత్త కాస్పెక్ట్ హైలెట్ గా ఉండబోతున్నాయట. అదీ.. సంగతీ!?