మెగా డాటర్ నిహారిక పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ మరింత మోడ్రన్‌గా తయారవుతోంది. ఇంత వరకు మామూలుగా ఉన్నా కూడా ఇప్పుడు మాత్రం స్టైల్ మార్చేసింది. తాజాగా తన స్నేహితురాలి పెళ్లికి నిహారిక చైతన్యలు కలిసి వెళ్లారు. అక్కడ నిహారిక రెడ్ డ్రెస్‌లో రింగు రింగులు జుట్టుతో కనిపించి అదరగొట్టేసింది. నిహారిక చైతన్యలు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే తన లుక్కు గురించి చెబుతూ సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ తెగ హల్చల్ చేస్తున్నాయి.
తన కొత్త లుక్ బాగుందని నెటిజన్లు అందరూ అంటుంటే మురిసిపోయింది. అయితే ఆ డ్రెస్‌ను డిజైన్ చేసిన వారి గురించి చెప్పింది.. తన హెయిర్ స్టైలీష్ట్ గురించి చెప్పకపోవడంతో ఆమె అలిగింది. ఇంతకీ నిహారిక హెయిర్ స్టైలీష్ట్ ఎవరో చెప్పలేదు కదా. ఆమె మరెవరో కాదు.. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ. నిహారికకు అక్క. శ్రీజ చేసిన్ హెయిర్ స్టైల్ గురించి చెప్పకపోవడంతో ఆమె హర్ట్ అయింది.
ఇదే విషయాన్ని నిహారికతో అంటే.. సారీ అంటూ చెప్పేసింది. ఈ క్రెడిట్ మాత్రం నీదే అని నిహారిక చెప్పింది. తాజాగా నిహారిక కొన్ని ఫోటోలను షేర్ చేసింది. వెరైటీ మూడ్ ఉందని చెప్పకనే చెబుతూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. మొత్తానికి నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందన్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో డిసెంబర్ 9న వివాహం జరగనుంది.