Home News మెగా బ్యూటీ అందాల ఆరబోత‌.. పెళ్లికి ముందు ర‌చ్చ చేస్తున్న నిహారిక‌

మెగా బ్యూటీ అందాల ఆరబోత‌.. పెళ్లికి ముందు ర‌చ్చ చేస్తున్న నిహారిక‌

మెగాస్టార్ చిరంజీవి వేసిన పూల‌బాట‌లో న‌డుస్తూ ఒక్కో హీరో త‌మ గ‌మ్య‌స్థానం చేరుకుంటున్నారు. ఒక‌రి త‌ర్వాత ఒక‌రం అన్న‌ట్టుగా ఈ ఫ్యామిలీ నుండి హీరోలు క్యూలు క‌డుతున్నారు. హీరోయిన్ల విష‌యానికి వ‌స్తే మెగా బ్ర‌ద‌ర్ నాగాబాబు కూతురు మాత్ర‌మే వెండితెర‌పై క‌థానాయిక‌గా అల‌రించింది. ముందు వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన ఈ పుత్తడి బొమ్మ ఒక మ‌న‌సు చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమానే నిహారిక‌కి పెద్ద షాక్ ఇచ్చింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో తర్వాత హ్యాపీ వెడ్డింగ్ అనే చిత్రం చేసింది. ఈ సినిమా అభిమానుల‌ని నిరాశ‌ప‌ర‌చింది. ఇక ఆ త‌ర్వాత చేసిన సూర్య‌కాంతం కూడా తుస్సుమంది.

Niharika Glamorous Shakes Social Media
niharika glamorous shakes social media

నిహారిక చేసిన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టిన‌ప్ప‌టికీ, ఈ అమ్మ‌డి క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ముఖ్యంగా సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిమానుల‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తూ వ‌చ్చిన నిహారిక ఇటీవ‌ల అంద‌రికి షాకింగ్ న్యూస్ చెప్పింది. చైత‌న్య‌తో ఏడ‌డుగులు వేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో అంద‌రు షాక్ అయ్యారు. పెళ్ళి త‌ర్వాత నిహారిక ఇక సినిమాలు చేయ‌డం మానేస్తుందేమోన‌ని అభిమానులు ఆవేద‌న చెందారు. కాని అలాంటిదేమి లేదు, పెళ్లి త‌ర్వాత కూడా సినిమాలు చేస్తాన‌ని ఈ భామ చెప్ప‌డంతో అభిమానుల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది.

Niharika Glamorous Shakes Social Media
niharika glamorous shakes social media

డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో వున్న ఉదయ్‌ విలాస్‌ను వివాహ వేదికగా చేసుకొని నిహారిక‌-చైత‌న్య‌లు పెళ్ళి చేసుకోబోతున్నారు. పెళ్లి ఏర్పాట్లను వ‌రుణ్ తేజ్ చూసుకుంటున్నాడు. పెళ్లి మ‌రో నెల రోజులు మాత్ర‌మే ఉండ‌డంతో నిహారిక తెగ ఫొటో షూట్స్ చేస్తుంది. స్టైలిష్ డ్రెస్‌ల‌లో నిహారిక అందాల విందు అభిమానుల కడుపు నిండేలా చేస్తుంది. తాజాగా నిహారిక‌కి సంబంధించి కొన్ని ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ఈ ఫోటోలకి సోష‌ల్ మీడియా షేక్ కావ‌డం ఖాయం అని అంటున్నారు.

Niharika Glamorous Shakes Social Media
niharika glamorous shakes social media

- Advertisement -

Related Posts

సెట్‌లొ అలాంటి పనులు.. తమన్నా మందలింపులు!!

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సీటీ మార్ సెట్‌లో బిజీగా ఉంది. అంతుకు ముందు గుర్తుందా శీతాకాలం షూటింగ్‌లో రచ్చ చేసింది. అక్కడ హీరో, దర్శకులతో తమన్నా, తన టీం ఎంత అల్లరి...

‘అదిరింది’కి కాలం చెల్లింది.. అందుకే చమ్మక్ చంద్ర అక్కడికి జంప్

జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర తిరుగులేని స్టార్డం. చమ్మక్ చంద్ర స్కిట్లను ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేసేలానే ఉంటాయి. ఎందుకంటే చమ్మక్ చంద్ర తీసుకునే పాయింట్ మొగుడు పెళ్లాం. ప్రతీ ఇంట్లో ఉండే...

బ్రహ్మానందం కంటే బిజీ , రోజుకి మూడు లక్షలు పారితోషికం తీసుకుంటున్నసీనియర్ హీరో..!

బ్రహ్మానందం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే. అంతేకాదు బ్రహ్మానందం డేట్స్ కూడా దర్శక నిర్మాతలకి దొరకడం ఒకప్పుడు గగనం అయ్యింది. చెప్పాలంటే...

కొత్త ఉద్యమం షురూ : ఇండియాకి నాలుగు రాజధానులు?

ఇంత పెద్ద భారతదేశానికి ఒకటే రాజధానా? ఎందుకు ఒకటే రాజధాని ఉండాలి. నాలుగు రొటేటింగ్ రాజధానులు భారత్ కు ఉండాలి.. అంటూ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అప్పట్లో...

Latest News