అందాల నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. సవ్యసాచి, మిస్టర్ మజ్ను చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమా రిలీజ్ కాకముందే రెండో చిత్రంలో ఆఫర్ వచ్చింది. కానీ ఆ రెండు చిత్రాలు కూడా దారుణంగా బెడిసి కొట్టాయి. అయినా కూడా మూడో ఆఫర్ వచ్చింది. పూరి జగన్నాథ్ పిలిచి మరీ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాన్స్ ఇచ్చాడు. అలా ఇస్మార్ట్ హీరోయిన్‌గా ముద్ర పడిపోయింది.
ఇస్మార్ట్ అందాలను తెలివిగా ప్రదర్శిస్తూ తనకు వచ్చిన మొదటి విజయాన్ని, ఆ క్రేజ్, ఫేమ్‌ను కాపాడుకుంటోంది. సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నిధి కాకరేపుతూ ఉంటుంది. లాక్డౌన్‌లో నిధి షేర్ చేసిన ఫోటోలు, ఎద అందాల ప్రదర్శనను ఎవ్వరూ మరిచిపోరు. మిర్రర్ సెల్ఫీలంటూ నెట్టింట మంట పెట్టేసింది. తాజాగా నిధి ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన బాధను వర్ణించింది.
నిధి అగర్వాల్ తన పెట్ గురించి చెబుతూ ఓ వీడియోను షేర్ చేసింది. ఆ పెట్ ఎప్పుడూ కూడా నిధి అగర్వాల్‌ను ఫాలో అవుతూ వస్తోందట. చివరకు టాయిలెట్‌కు వెళ్తుంటే కూడా వెంటే వస్తోందట.. ఎందుకు అలా వస్తున్నావ్ అంటూ నిధి అగర్వాల్ ఆ పెట్‌ను ప్రశ్నించింది. దీంతో డోర్ వద్ద నక్కి నక్కి చూస్తున్న పెట్ వెనుదిరిగి వెళ్లిపోయింది. నిధి అగర్వాల్ వీడియోలు ఈ మధ్య బాగా వైరల్ అయ్యాయి. రాజమండ్రి షూటింగ్ లొకేషన్‌లో నిధి కోసం జరిగిన తోపులాటలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.