అభిమానుల చర్యలు.. నిధి అగర్వాల్ ఎమోషనల్

Niddhi Agerwal Emotional On Fans Services

హీరోలను దైవ సమానులుగా చూసే అభిమానులుంటారు. మరీ ముఖ్యంగా దక్షిణాదిన హీరోలంటే ప్రాణాలిచ్చే అభిమానులుంటారు. హీరోల కోసం ఉన్నదంతా ఊడ్చిపెడుతుంటారు. అలా హీరోలంటే వెర్రెక్కిపోయే అభిమానం ఉంటుంది. అయితే హీరోయిన్లను సైతం ఇష్టపడుతుంటారు. హీరోయిన్లను అంతే స్థాయిలో ప్రేమిస్తుంటారు.. అభిమానిస్తుంటారు. అయితే చేతల్లో మాత్రం అంతగా చూపించరు.

Niddhi Agerwal Emotional On Fans Services
Niddhi Agerwal Emotional On Fans Services

కానీ ఈ మధ్య హీరోయిన్ ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగుతున్నారు. సేవా కార్యక్రమాలు చేస్తూ హీరోయిన్ల పేరు నిలబెడుతున్నారు. ఈమధ్య పూజా హెగ్డే, రష్మిక మందాన్ ఫ్యాన్స్ కూడా సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. అన్నదానాలు, రక్తదానాలు, పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలను చేశారు. లాక్డౌన్ కాలంలోనూ హీరోయిన్ల అభిమానులు ఎంతో చురుకుగా పని చేశారు.

వాటిపై సదరు హీరోయిన్లు స్పందిస్తు ఎమోషనల్ అయ్యారు. తాజాగా ఇప్పుడు నిధి అగర్వాల్ వంతు వచ్చింది. నిధి అగర్వాల్ అభిమానులు కూడా తాజాగా ఓ అనాథాశ్రమంలో అన్నదానం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నిధి ఎంతో ఎమోషనల్ అయింది. ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది.. మిమ్మల్ని చూస్తే ఎంతో గర్వంగా ఉందంటూ తన అభిమానులను ప్రశంసలతో ముంచెత్తింది.