‘గేమ్ ఛేంజర్’ అప్పుడే కాదు.!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న వుద్దేశ్యంలో ఇంతవరకూ మేకర్లు వున్నారు.

దాంతో, అభిమానులు కూడా అందుకు సిద్ధమైపోయారు. అయితే, ఇప్పుడు గేమ్ ప్లాన్ మారిపోయింది. సంక్రాంతి బరిలో చాలా సినిమాలున్నాయ్. అందులోనూ పెద్ద సినిమాలు కావడంతో, ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఇంకాస్త ఆలస్యం కానుందనీ తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాపై అస్సలు బజ్ లేదు. ప్రొడ్యూసర్ దిల్ రాజు సైలెంట్ అయిపోయారు. రామ్ చరణ్ కూడా ఈ సినిమా గురించి ఏమీ మాట్లాడడం లేదు. శంకర్ సంగతి సరే సరి.

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా ఇది. అలాంటిది ఈ సినిమా రిలీజ్ విషయంలో నెలకొన్న గందరగోళానికి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసలీ సినిమా అప్‌డేట్స్ ఇచ్చేందుకు కూడా దిల్ రాజు ఇష్టపడ్డం లేదట. అంటే సినిమా పోస్ట్ పోన్ అయినట్లే అని ఓ అంచనాకి వచ్చేశారు.

అయితే, సంక్రాంతికి టైమ్ చాలానే వుంది. ఈ లోపు గేమ్ ఎలాగైనా ఛేంజ్ అవ్వొచ్చు.. అనే వాదన వినిపిస్తోంది మరోవైపు.