అన్నీముక్కల సినిమాలే.!

‘ఓజీ’ రెండు పార్టులుగా తెరకెక్కుతోందన్న ప్రచారం జరుగుతోంది. ‘దేవర’ కూడా రెండు పార్టులగానే రిలీజ్ చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

మహేష్‌తో రాజమౌళి తెరకెక్కించబోయే సినిమా ఎలాగూ స్పేన్ ఎక్కువే. రెండు పార్టులుగానే రిలీజ్ చేస్తాడు జక్కన్న. కానీ, ‘బింబిసార’ సినిమాకి రెండో పార్ట్ వుంటుందని చెప్పాడు డైరెక్టర్ వశిష్ట. కానీ, ఇంతవరకూ ఆ ఊసే లేదు.

మెగాస్టార్ చిరంజీవితో సినిమాకి వశిష్ట సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కథకి ఎక్కువ స్పేన్ వుంటే ఫర్వాలేదు. రెండు పార్టులుగా తెరకెక్కించొచ్చు. ‘బాహుబలి’ సినిమాకి కథా స్పేన్ ఎక్కువ కాబట్టి.. రెండు పార్టులుగా రిలీజ్ చేసినా ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బంది లేదు.

కానీ, ఇప్పుడు కథలలా కాదు. కథలో అంత సీను లేకపోయినా రెండో పార్ట్ అని అనౌన్స్ చేసేస్తున్నారు. బహుశా కథను ఎక్కడ ముగించాలో తెలియకే రెండో పార్ట్ కోసం సాగతీత వదులుతున్నారనీ.. అదే రెండో పార్ట్ అని అనౌన్స్ చేస్తున్నారనీ సెకండ్ పార్ట్ సినిమాలపై విమర్శలు వస్తున్నాయ్.

అదీ నిజమే.! ‘బాహుబలి’ రెండు పార్టులుగా రిలీజ్ చేశారంటే మొదటి పార్ట్‌లో అనేక అనుమానాలు, సమాధానం లేని ప్రశ్నలు వదిలిపెట్టాడు. వాటన్నింటికీ రెండో పార్ట్‌లో వివరంగా సమాధానమిచ్చాడు జక్కన్న.