Sarkaru vaari pata:సర్కారు వారి పాట సినిమా నుంచి మరొక మాస్ సాంగ్ వచ్చేస్తోంది..!

Sarkaru vaari pata:సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం సర్కారు వారి పాట విడుదలకు సిద్ధంగా ఉంది.ఇక మహేష్ సరసన ఈ సినిమా లో కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా ను మే 12 నా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా లో మహేష్ యంగ్ లుక్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. బ్యాంకింగ్ రంగం లో జరిగే మోసాలు గురించి సాగే కథగా సర్కారు వారి పాట సినిమా తెరకెక్కింది. అయితే యాక్షన్ తో పాటు ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందించారు డైరెక్టర్ పరశురామ్.

ఇప్పటికే విడుదలైన కళావతి సాంగ్ సంగీత మాధ్యమాలను ఊపేసింది. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ గ్లింస్ కి కూడా విశేష స్పందన వచ్చింది. ఇదే క్రమంలో ఈ సినిమాకు సంబంధించి సెకండ్ సింగిల్‌ను  చిత్ర బృందం ఎలా చేయబోతున్నారు. చిత్ర బృందం విడుదల చేయబోతున్నాం సెకండ్ సింగల్ కు సంబంధించిన అప్డేట్ నీ సోషియల్ మీడియాలో సంగీత దర్శకుడు తమన్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో విడుదల చేయబోయే ఇది ఒక మా సాంగ్ అని అభిమానులకు క్లూ కూడా ఇచ్చేశారు.దూకుడు, ఆగడు చిత్రాలలో మహేశ్‌కు మాంచి మాస్ సాంగ్స్  ఇచ్చారు తమన్.

సంగీత దర్శకుడు థమన్ ,దర్శకుడు పరశురామ్, మరియు సాహిత్య రచయిత అనంత్ శ్రీరామ్ కలిసి ఉన్న ఫొటోను పెట్టి ‘మాసీవ్ వన్ లోడింగ్’.. అంటూ కామెంట్ జతచేశారు. ఇక ఈ సినిమాలో ఎలాంటి మా సాంగ్ ఇస్తారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మొదట వచ్చిన కళావతి సాంగ్ అదరగొట్టడంతో దీని మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.