Ram Charan:మెగా స్టార్ చిరంజీవి నట వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ మొదట్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత తనకంటూ సొంత గుర్తింపుతో నటన, గ్రేస్ ఉన్న డాన్సు తో ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్,తారక్ కన్న కాంబినేషన్లో వస్తున్న అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్ విడుదలకు సిద్ధమైంది. మార్చి 25న ఈ సినిమా విడుదలకు ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం ప్రమోషన్ల బిజీ లో ఉన్నారు ఆర్ ఆర్ ఆర్ టీం. ఇదిలా ఉండగా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాటు ఏక కాలంలోనే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఇది కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇక ఇపుడు శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా 3వ షెడ్యూల్ చిత్రీకరణ రాజమహేంద్రవరం లో జరిగింది. ఈ భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మక సినిమా కు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా దాదాపుగా సగం వరకు షూటింగ్ పూర్తయిందని సమాచారం, జూలై లో ఆర్ సీ 15 సినిమా పూర్తి అవుతుందని వార్తలు వస్తున్నాయి.
రామ్ చరణ్ నటిస్తున్న 15వ చిత్రం సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి అయ్యే దశలో ఉండగా, రామ్ చరణ్ తదుపరి చిత్రం పై ఉత్కంఠ నెలకొంది. రామ్ చరణ్ ఆర్ సి 16 ఏ డైరెక్టర్ తో తీస్తాడు అనేదాని గురించి అభిమానులు అప్పుడే చర్చించుకుంటున్నారు.రామ్ చరణ్ 16వ సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో మొదలు పెడుతున్నట్లు,అభిమానుల ఉత్కంఠకు తెర తీసేలా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. గౌతమ్ తిన్ననూరి ఇంతకుముందు నాని తో జెర్సీ సినిమా తీశారు. ప్రస్తుతం రామ్చరణ్ పదహారవ సినిమాని యు వి క్రియేషన్స్ వారు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నిర్మించబోతున్నారు.రామ్ చరణ్ శంకర్ ల సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చింది. ఇక రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి ల కాంబినేషన్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.