“అఖండ” విషయంలో బోయపాటిని దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్..!

Balakrishna-Akhanda-1200x800

టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ ఒక కం బ్యాక్ ఇస్తే దానికి రెస్పాన్స్ ఏ లెవెల్లో ఉంటుందో తన భారీ హిట్ చిత్రం “అఖండ” చూస్తే తెలుస్తుంది. అలాంటి కరోనా సమయంలో అది కూడా చాలా తక్కువ టికెట్ ధరలతో కూడా బాలయ్య అండ్ బోయపాటి కాంబినేషన్ సంచలనం సృష్టించారు.

తెలుగు సినిమాకి పూర్వ వైభవం కూడా తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రాన్ని చూసేందుకు ఊర్ల నుంచి బస్సులు, ఎడ్ల బండ్లతో కూడా ఎంతోమంది థియేటర్స్ లోకి రాగ కొందరు అఘోరాలు కూడా ఈ సినిమా చూడడం జరిగింది. దీనితో అఖండ పేరుకి తగ్గట్టుగా అఖండమైన విజయాన్ని సాధించగా ఈ సినిమా విషయంలో బోయపాటి శ్రీను చేసిన తాజా కామెంట్స్ సోషల్ మీడియాలో మెయిన్ గా మూవీ లవర్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు థమన్ వర్క్ చేసిన సంగతి తెలిసిందే. కాగా థమన్ ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ అయితే ఆ టైం లో ఎవరికీ ఇవ్వలేదు. సినిమా కథకి తగ్గట్టుగా మహాశివుని భక్తులకి పూనకం తెప్పించేలా సంగీతం అందించాడు. సినిమాలో ఆ విజువల్స్ ని అసలు హైలైట్ చేసిందే థమన్ అన్నట్టుగా అయ్యింది.

కానీ అసలు ఈ సినిమాకి మ్యూజిక్ లేకపోయినా కూడా దుమ్ము లేచిపోతుంది ఆ సీన్స్ కి అంటూ బోయపాటి కామెంట్స్ చేయడం చాలా మందికి నచ్చలేదు. అసలు ఆ సినిమాకి థమన్ స్కోర్ లేకపోతె సినిమా ఇంత సక్సెస్ అయ్యేదే కాదు అని బోయపాటి విషయంలో నెటిజన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలా క్రెడిట్ అంతా తాను ఒక్కడే తీసేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని బోయపాటి విషయంలో ఆడియెన్స్ ఇప్పుడు మండిపడుతున్నారు.