గత కొంతకాలంగా నందమూరి బాలకృష్ణ క్రేజ్ ఊహించని స్థాయిలో పెరిగిపోతోంది. అన్ స్టాపబుల్ షోచేవబ ఊహించిన విధంగా ఫాన్ ఫాలోవర్స్‌ను పెంచుకున్నారాయన. అలానే అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్యాక్ టు బ్యాక్ వరుస భారీ బ్లాక్ బస్టర్ హిట్లతో ప్రస్తుతం బాలయ్య ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిపోయింది. ఒక్కో సినిమాకు ప్రస్తుతం రూ.20కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. ఇటీవల వీర సింహారెడ్డి సినిమాకు సంబంధించిన ఓపెనింగ్స్ ఊహించని రికార్డ్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆయన కెరీర్లోనే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది.
అయితే రాబోయే రోజుల్లో బాలకృష్ణ నుంచి మరిన్ని ఆసక్తికరమైన కాంబినేషన్స్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK 108 ఒక సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆయన పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. అంతేకాకుండా మంచి ఎంటర్టైన్మెంట్ కూడా అందించే పాత్ర కూడా చేయబోతున్నారు.
ఇక దీని తర్వాత NBK 109 గురించి గత కొద్ది రోజులుగా తెగ వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ దర్శకులతో పాటు యువ దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో పూరీజగన్నాథ్, క్రిష్, బోయపాటితో పాటు ప్రశాంత్ వర్మ, వెంకటేశ్ మహా పేర్లు ఉన్నాయి. అయితే ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే బాలయ్య NBK 109ని ఓ కొత్త దర్శకుడితో చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ నూతన దర్శకుడు ఇటీవలే తన తొలి సినిమా మంచి హిట్ అందుకున్నారని సమాచారం. ఆ సినిమా రూ.50కోట్ల వరకు ఆర్జించిందట. అయితే ఇప్పుడీ కాంబినేషనల్లో ఓ చిన్న సమస్య వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అదేంటంటే.. ఈ సినిమాకు కూడా బాలయ్య రూ.20కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట.
అయితే ఆ దర్శకుడు కూడా తనకు రూ.10కోట్లు పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. కానీ ఆ మూవీ నిర్మాత.. కేవలం రూ.2 కోట్లు మాత్రమే ఇస్తానని, నాన్ థియేట్రికల్ లాభాల్లో 20 శాతం షేర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. అయితే ఆ ఆఫర్ నచ్చని దర్శకుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడట. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయట. మరి ఆ దర్శకుడు ఎవరో, నిర్మాత ఎవరో స్పష్టంగా తెలీదు.