Nazriya Nazim: తెలుగులో మొదటి సినిమాకే డబ్బింగ్ చెప్పుకుంటున్న నజ్రియా..!

Nazriya Nazim: శ్యామ్ సింగరాయి సినిమా తర్వాత నాని నటిస్తున్న చిత్రం అంటే సుందరానికి. అంటే సుందరానికి సినిమాకి యువ దర్శకుడు అయినా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా ద్వారా తొలిసారి నజ్రీయా తెలుగు సినిమా లో నటించనున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. జూన్ 10న విడుదల చేయబోతున్నామని ఇంతకముందే చిత్రబృందం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. నజ్రియా తెలుగులో తన మొదటి సినిమా అయినప్పటికీ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుందట. మొదటి సినిమాకే తెలుగులో డబ్బింగ్ చెప్పి అందరినీ ఆకట్టుకుంటోంది.హీరోయిన్ నజ్రియా ఫాహద్‌తో డబ్బింగ్‌ను దర్శకుడు వివేక్ ఆత్రేయ పూర్తి చేయించాడు.

ఈ క్రమంలోనే నజ్రియా తన డబ్బింగ్ పూర్తి చేసిన సందర్భంలో దర్శకుడితో తన ఫోటోని షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చింది.’నేడు నేను అంటే సుందరానికీ! సినిమా డబ్బింగ్ పూర్తి చేశాను. ఈ మూవీని ఓ అద్బుతమైన వ్యక్తి తెరకెక్కించాడు. అతను ఇప్పుడు నాకు మంచి స్నేహితుడు కూడా’.. అంటూ నజ్రియా తెలిపింది. ఈ సినిమాలో నాని క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని తెలియజేసింది.