నజ్రియా నాని హీరోయిన్ అంటే టాలీవుడ్ లో సెటిలైనట్టే..!

నేచురల్ స్టార్ నాని కి జంటగా నటించాలని చాలామంది అమ్మాయిలు ఆసక్తిని చూపిస్తుంటారు. సాయి పల్లవి పర్ఫార్మెన్స్ లో నాని కి గట్టి పోటీ ఇస్తుంది. నాని నటిస్తుంటే ఒక ఛాలెంజింగ్ గా ఫీలవుతుందట. అలాగే నివేదా థామస్, నాని నేచురల్ పర్ఫార్మెన్స్ కి ఫ్లాటైపోతుంది. మిడిల్ క్లాస్ అబ్బాయి లో నాని తో కలిసి నటించిన సాయి పల్లవి మళ్ళీ ఇప్పుడు శ్యాం సింగ్ రాయ్ లో నటించబోతోంది. ఈ సినిమాలో సాయి పల్లవి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. సాయి పల్లవి కూడా ఎప్పుడు పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటేనే సినిమా ఒప్పుకుంటుంది.

Nani Ninnu Kori dialogues and quotes, #TeluguMovieDialogues, #NinnuKori,  #Nani, #NivethaThomas, #AadhiPinisetty | Movie dialogues, Movies, Dialogue

ఇక నివేదా థామస్ తో నాని కి స్పెషల్ బాండింగ్ ఉందంటారు. ఇద్దరు కలిసి జెంటిల్ మాన్.. నిన్నుకోరి చేశారు. రీసెంట్ గా వి సినిమాలో నటించింది నివేదా. అయితే ఈ సినిమాలో నాని ఉన్నాకూడా సుధీర్ బాబు కి జంటగా నటించింది. అలాగే నాని తో నటించిన హీరోయిన్ విషయంలో కూడా చాలా గొప్పగా చెబుతుంటాడు నాని. తనతో చేసిన హీరోయిన్స్ ని మంచి టాలెంటెడ్ హీరోయిన్స్ అని పొగుడుతుంటాడు. సాయి పల్లవి, నివేదా థామస్, అను ఇమ్మానియేల్, కీర్తి సురేష్, శ్రద్ద శ్రీనాథ్, గ్యాంగ్ లీడర్ లో నటించిన ప్రియాంక అరుల్ మోహన్.

Nani to romance Priyanka Arul Mohan

ఇలా చాలామంది హీరోయిన్స్ నాని తో నటించి టాలీవుడ్ లో సక్సస్ అయ్యారు. గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక అరుల్ ని కూడా నాని తెగ పొగిడేశాడు. టాలీవుడ్ లో మంచి సినిమాలు చేస్తుందని చెప్పుకొచ్చాడు. అన్నట్టుగానే ప్రియాంక శర్వానంద్ తో శ్రీకారం అన్న సినిమా చేస్తుంది. అలాగే నాగ చైతన్య – దిల్ రాజు – విక్రం కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా ప్రియాంక అరుల్ నటించబోతున్నట్టు సమాచారం.

ఈ లిస్ట్ లో ఇప్పుడు నజ్రియా నాజిం వచ్చి చేరింది. ఇప్పటికే తమిళ మలయాళ సూపర్ హిట్ సినిమాలు చేసిన నజ్రియా కి నాని 28 లో అవకాశం వచ్చింది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. నజ్రియా మల్టీ టాలెంటెడ్. హీరోయిన్ గా.. సింగర్.. డాన్సర్… హోస్ట్ గా చాలా పాపులారిటీని సంపాదించుకుంది. ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్ గా క్రేజ్ ఉంది. అలాంటి టాలెంటెడ్ హీరోయిన్ మొదటిసారి నాని తో జత కడుతూ టాలీవుడ్ కి ఎంటరవుతుందంటే ఖచ్చితంగా టాలీవుడ్ లో సెటిలవుతుందని అందరూ భావిస్తున్నారట.