గాడ్ ఫాదర్ కోసం దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ తీసుకున్న నయనతార?

నయనతార దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర తారక ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె గత రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నారు. ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇకపోతే సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతార ముందు వరుసలో ఉంది.ఈమె ఒక్కో సినిమాకు సుమారు ఏడు కోట్ల రూపాయలు వరకు రెమ్యూనరేషన్ తీసుకొని అందరికీ షాక్ ఇస్తుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నటువంటి నయనతార ఈ సినిమా కోసం తక్కువ కాల్ షీట్స్ కేటాయిస్తున్నప్పటికీ రెమ్యూనరేషన్ మాత్రం భారీగా తీసుకుందని వార్తలు వినపడుతున్నాయి. నయనతార పూర్తిస్థాయి హీరోయిన్ గా నటిస్తే ఒక్కో సినిమాకి 7 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అయితే కేవలం గాడ్ ఫాదర్ సినిమాలో తక్కువ నిడివి ఉన్నప్పటికీ ఏకంగా మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

హీరోయిన్ గా కాకుండా హీరో చెల్లెలు పాత్రలో నటించడం కోసం మూడు కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.గతంలో మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించిన నయనతార ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో ఆయనకు చెల్లెలుగా నటించబోతున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది.