గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ కి హాజరు కానున్న నయనతార..?

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార తెలుగు తమిళ్ భాషలలో స్టార్ హీరోల సరసన ఎన్నో సినిమాలలో నటించి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందింది. నయనతార ఎక్కువగా గ్లామర్ పాత్రల కన్నా నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన సినిమాలలో నటించటానికి ఆసక్తి చూపుతు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అయితే నయనతార నటించిన ఏ సినిమాకి కూడా ఆమె ప్రమోషన్లతో సంబంధం లేకుండా ఉంటుంది.

ఒక సినిమాకి అగ్రిమెంట్ చేసుకుంటున్నప్పుడే ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశం లేదని తేల్చి చెప్పేస్తుంది. ఆమె ఎంత స్టార్ హీరోతో నటించినా కూడా ప్రమోషన్స్ లో మాత్రం పాల్గొనదు. అయినా కూడా నయనతారకి ఉన్న స్టార్డం వల్ల నిర్మాతలు కూడ అందుకు అంగీకరించి ఆమెతో సినిమాలు చేస్తున్నారు. ఇటీవల విగ్నేశ్ శివన్ ని వివాహాం చేసుకున్న నయన్ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ్ సినిమాలతో పాటు తెలుగులో చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలి క్యారెక్టర్ లో నటిస్తోంది. ఇక హిందీలో కూడా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది.

ఇదిలా ఉండగా కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నయనతార గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ కి హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కొన్ని రోజులలో ఈ సినిమా నుండి ఫస్ట్ ఆడియో కి సంబంధించిన అప్డేట్ రానుంది. గాడ్ ఫాదర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న మోహన్ రాజాకు నయనతారకు మధ్య మంచి అనుబంధం ఉంది.

ఈ ఇద్దరి కాంబోలో తని ఒరువన్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. అందువల్ల తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ అడిగితే నయనతార తప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమా ప్రమోషన్స్ లో పాలుపంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా విగ్నేష్ తో పెళ్లి జరిగిన తర్వాత నయన్ తెలుగు ప్రేక్షకులని కలుసుకునే అవకాశం ఎప్పటి వరకు రాలేదు. అందువల్ల ఈ రూపంలో అయినా ఈ అవకాశాన్ని వాడుకొని తెలుగు అభిమానులతో ముచ్చటించి అవకాశం ఉంటుందని సమాచారం. అయితే ఇదంతా జరగాలంటే నయనతార డేట్స్ మీద ఆధారపడి ఉంటుంది.