విదేశాల్లో కుటుంబ సభ్యులతో కలిసి భర్తకు పుట్టినరోజు వేడుకలు చేసిన నయనతార.. ఫోటోలు వైరల్!

లేడీ సూపర్ స్టార్ నయనతార తన భర్త విగ్నేష్ శివన్ తో కలిసి విదేశాలలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా పలు దేశాలను చుట్టేస్తూ వీరి వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. ఇలా నయనతార చాలా సంవత్సరాల పాటు డైరెక్టర్ విగ్నేష్ ను ప్రేమిస్తూ ఈ ఏడాది ఎంతో ఘనంగా తనని వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం వీరిద్దరికీ ఏమాత్రం ఖాళీ సమయం దొరికిన విదేశీ పర్యటన వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దుబాయ్ లో వీరి కుటుంబ సభ్యులు కూడా సందడి చేశారు.

ఈ క్రమంలోనే నయనతార దుబాయ్ లోని అత్యంత అందమైన బుర్జ్ ఖలిఫా వద్ద తన భర్త విగ్నేష్ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేశారు. విగ్నేష్ తల్లితోపాటు తన సోదరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఫోటోలను చూస్తే తెలుస్తుంది.ఈ క్రమంలోనే విగ్నేష్ శివన్ తనకు పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసిన సందర్భంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రియమైన నా కుటుంబంతో,బుర్జ్ ఖలీఫా కింద పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది.ఈ జీవితంలో నాకు అన్ని అందమైన క్షణాలను అందించిన దేవునికి ఎల్లప్పుడూ ధన్యవాదాలు. అంటూ సోషల్ మీడియలో పోస్టు చేశారు.

ఈ విధంగా అర్ధరాత్రి సమయంలో నయనతార తన కుటుంబ సభ్యులతో కలిసి తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు సెలబ్రేట్ చేస్తూ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేయడమే కాకుండా టపాసులు పేలుస్తూ ఎంతో ఘనంగా ఈ పుట్టినరోజు వేడుకలను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ విధంగా నయనతార తన భర్తకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వడంతో విగ్నేష్ సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.