నయనతార గత రెండు దశాబ్దాల క్రితం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అంచలంచలుగా ఇండస్ట్రీలో ఎదుగుతూ నేడు దక్షిణాది సినీ ఇండస్ట్రీలోని అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా చలామణి అవుతున్న నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల వరకు చార్జ్ చేస్తున్నారు.ఇలా ఈమె పది కోట్లు డిమాండ్ చేసిన సినిమా ప్రమోషన్లకు రాకపోయినా ఈమెకు సినిమా అవకాశాలు వస్తున్నాయి అంటే ఈమెకు ఎలాంటి డిమాండ్ ఉందో అర్థమవుతుంది.
ఇలా వరుస సినిమాలలో నటిస్తూ భారీగా సంపాదించిన నయనతార పెద్ద ఎత్తున విలువైన ఆస్తులను కూడా పెట్టినట్లు తెలుస్తుంది.ఈమె సంపాదించినది మొత్తం చెన్నైలో పలు ఖరీదైన ప్రాంతంలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయడమే కాకుండా హైదరాబాదులో కూడా జూబ్లీహిల్స్ ప్రాంతంలో రెండు ఖరీదైన బంగ్లాలను కొనుగోలు చేసినట్టు సమాచారం.హైదరాబాదులో ఈమె కొనుగోలు చేసిన బంగ్లాలు ఒక్కొక్కటి 15 కోట్ల రూపాయలు విలువ చేస్తున్నాయని తెలుస్తోంది. అలాగే చెన్నైలో కూడా అన్ని వసతులతో కూడిన అపార్ట్మెంట్స్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.
ఇది మాత్రమే కాకుండా ఖరీదైన కార్లు ఉన్నాయని ఈమె తన కోసం ప్రత్యేకంగా స్పెషల్ జెట్ కూడా కొనుగోలు చేశారని తెలుస్తుంది. ఇలా సినిమా ఇండస్ట్రీలో సంపాదించినది మొత్తం ఈమె ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా సినిమాలలో సంపాదించినది పెట్టుబడులు పెడుతూ భవిష్యత్తులో వ్యాపార రంగంలో కూడా ముందుకు కొనసాగాలనే ఆలోచనలో నయనతార ఉన్నట్టు సమాచారం.ఇక మొత్తం నయనతార ఆస్తుల కలిపి సుమారు 200 కోట్ల వరకు విలువ చేస్తాయని తెలుస్తుంది.