ఓ సీనియర్ హీరో సరసన హీరోయిన్ రోల్ కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను సంప్రదించారట. ఆమె చెప్పిన రెమ్యనరేషన్ విన్నాక, సదరు హీరో, ఆ హీరోతో సినిమా తెరకెక్కించాలనుకుంటున్న దర్శకుడు.. ఈ కాంబినేషన్‌ని సెట్ చేసిన నిర్మాత.. అంతా నోరెళ్ళబెట్టారట.
‘అదేంటీ, ఇప్పుడంత మార్కెట్ లేదు కదా.?’ అని నయనతార మొహమ్మీదే సదరు నిర్మాత అనేశాడట. ‘నా రేంజ్ అంతే.. ఇకపై మీ ఇష్టం..’ అనేసిందట నయనతార. దాంతో, ఆ చిత్ర నిర్మాతకి మైండ్ బ్లాంక్ అయ్యిందట.
తెలుగు సినిమాల ప్రమోషన్ కోసం నయనతార అస్సలు రాదు. మొన్నామధ్యన తన భర్త సినిమా కావడంతో ప్రమోషన్స్ చేసుకుంది. అది పెద్దగా వర్కవుట్ అవలేదు కూడా. దాంతో, నయనతార స్టార్‌డమ్ దారుణంగా పడిపోయింది.
అయినాగానీ, రెమ్యునరేషన్ విషయంలో అస్సలు తగ్గట్లేదట. అన్నట్టు, సదరు హీరోతో నయనతార గతంలో రెండు సినిమాలు చేసిందండోయ్.!