Samantha : ఖతిజా కోసం కన్మణి సర్ ప్రైజ్ గిఫ్ట్… ఈ ఇద్దరి స్నేహం సూపర్..!

Samantha: సమంత నయనతార విజయ్ సేతుపతి కాంబినేషన్లో విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న కాతువాకుల రెండు కాదల్‌ సినిమా సం‍గతి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రాన్ని ”కన్మణి రాంబో ఖతీజా” పేరుతో విడుదల చేయబోతున్నారు. సమంతా నయనతార ఇద్దరూ సౌత్ ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్గా వెలుగొందుతున్న ఇద్దరినీ పెట్టి ఒకే సినిమా తీస్తున్నారు డైరెక్టర్ విగ్నేష్ శివన్ . విజయ్ సేతుపతి ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి విగ్నేష్ శివన్ ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ దీనికి సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా ద్వారా నయనతార సమంత ల స్నేహం మరింత బలపడింది అని తెలుస్తోంది. సెట్ లో ఇద్దరు చాలా సన్నిహితంగా కూడా ఉంటున్నారు. సెట్ లో నాయన తార సమంత కు కేక్ తినిపిస్తున్న ఫోటో కూడా ఈమధ్య బాగా వైరల్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ఏప్రిల్‌ 28న విడుదల కానుంది.

ఈ క్రమంలో సమంత కోసం నయనతార ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ పంపించింది. ‘డియర్ ఖతీజా.. విత్ లవ్.. కణ్మణి’ అంటూ నయన్‌ సమంత కోసం కాస్ట్‌లీ గిఫ్ట్‌ పంపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. థ్యాంక్యూ డార్లింగ్‌ నయన్‌ అంటూ పోస్ట్‌ చేసింది.  ప్రస్తుతం వీరి స్నేహం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.