నయనతార ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తూ యమా బిజీగా ఉంది. ఇండస్ట్రీకొచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా.. ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చినా నయనతార ని మాత్రం డామినేట్ చేయలేకపోతున్నారు. తెలుగులో గాని, తమిళంలో గాని తనకోసం వచ్చే కథలు ఖచ్చితంగా ఒప్పుకుంటోంది. అంతేకాదు స్టార్ హీరోల మాదిరిగా అన్ని రకాల ప్రయోగాలు చేస్తోంది. ఆ మధ్య నయనతార అమ్మవారు పాత్రలో నటించింది. పక్క కమర్షియల్ హీరోయిన్ అయిన నయనతార ఈ సినిమా ఒప్పుకుంటుందని ఎవరూ భావించలేదు.
అంతేకాదు ఈ సినిమా తో నయనతార మెప్పిస్తుందా అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. కాని అందరి అనుమానాలకి హిట్ తో సమాధానం ఇచ్చింది. టాలీవుడ్ లో అనుష్క శెట్టి తో కంపేర్ చేసి చూస్తే నయనతార చాలా టాప్ లో ఉందంటున్నారు. కారణం అనుష్క నిశ్శబ్ధం సినిమా తర్వాత మళ్ళీ ఇంతవరకు సినిమా ప్రకటించలేదు. కాని నయన్ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు కమిటవుతూ ఆ సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూ ఉంది.
కాగా నయనతార సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న అన్నాత్తే సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కాబోయే భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో నటిస్తుండగా .. ఈ సినిమా సెట్స్ మీద ఉంది. సమంత, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా మరొక సినిమా చేసేందుకు రెడీ అయిందట నయన్. ‘పాత్తు’ అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి ఆల్ఫాన్స్ పుత్రెన్స్ దర్శకత్వం వహించబోతున్నాడు. ‘ప్రేమమ్’ సినిమాతో అటు తమిళం ఇటు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఆల్ఫాన్స్ పుత్రెన్స్ నయనతార కోసం ప్రత్యేకంగా కథ సిద్దం చేసినట్టు సమాచారం.