లేడి సూపర్ స్టార్ నయనతార రీసెంట్‌గా అమ్మోరు తల్లి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రీసెంట్‌గా ఓటీటీలో విడుదల కాగా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అమ్మవారి అవతారంలో నయన్‌ని చూసి అభిమానులు చాలా సంతోషించాఉ. ఆర్జే బాలాజి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది
ఇక నయనతార పర్సనల్ విషయానికి వస్తే ఇప్పటికే ప్రభుదేవా, శింబులతో బ్రేకప్ చెప్పిన ఆమె ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో డేటింగ్‌లో ఉంది. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలు వేయడం, విదేశాలకు వెకేషన్‌గా వెళ్లడం వంటివి చేస్తున్నారు.వీరిద్దరి పెళ్లి వచ్చే ఏడాది జరగనుందని జోరుగా చర్చలు నడుస్తున్న సమయంలో నయనతార పెళ్లి కూతురు గెటప్‌లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది.
ఎర్రటి చీర, మెడలో నగలు, తలపై ఆభరణాలుతో అచ్చం పెళ్ళికూతురులానే కనిపిస్తుంది. ఈ ఫొటో చూసి అందరు షాకయ్యారు. నయనతార సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా అంటూ ఆరాలు తీయడం మొదలు పెట్టారు. అసలు విషయం తెలిసిందేమంటే యాడ్ షూట్‌లో భాగంగా నయనతార ఇలా రెడీ అయిందని అంటున్నారు.
చెన్నైలోని చీరల దుకాణం కోసం ఓ ప్రకటన చేసింది నయనతార. ఇందులో భాగంగానే నయనతార సంప్రదాయబద్ధంగా రెడీ అయింది. ఈ ఫోటో అందరిని ఎంతగానో కన్ఫ్యూజ్ చేయడమే కాక షాక్ అయ్యేలా చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చేస్తున్న నయన్ ఫోటోపై అభిమానులు వాళ్ల స్టైల్‌లో కామెంట్స్ పెడుతున్నారు.