Navdeep : సినిమా పరిశ్రమ అందరికి అవకాశాలు ఇస్తుంది. అయితే అది అందుకోవడంలో చాలా మంది వెనకబడతారు మరీ కొంత మంది చేజేతుల కోల్పోతారు. అలాగే జరిగింది నవదీప్ విషయంలో. జై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నవదీప్ గౌతమ్ ఎస్ ఎస్ సి సినిమాతో పర్వాలేదనిపించిన హీరో గా నిలబడలేదు. తర్వాత వచ్చిన చందమామలో నటనకు ప్రశంసలు అందుకున్న అవకాశాలు మంచి విజయాలు రాలేదు.
తిరిగి బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య 2 ద్వారా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చి తనదైన టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 లో అతని వైల్డ్ కార్డు ఎంట్రీ ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు లో వైల్డ్ కార్డు ఎంట్రీల్లో ది బెస్ట్ అని చెప్పవచ్చు. అంతలా ప్రేక్షకులను అలరించాడు.
చాలా మంది హీరో హీరోయిన్ లు బిజీ షెడ్యూల్ వల్ల కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తుండడం మనం చూస్తూ ఉంటాం. అయితే వారు రిజెక్ట్ చేసిన సినిమా హిట్టయితే వారికి ఉండే ఆ బాధ చెప్పలేనిది ఎందుకు అంటే అలాంటి సినిమాల వల్లే వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక అసలు విషయంలోకి వెళితే అలాంటి వారిలో హీరో నవదీప్ కూడా ఉన్నాడు . అయితే అప్పట్లో నవదీప్ 2006లో రిలీజ్ అయిన బొమ్మరిల్లు అనే సినిమాని రిజెక్ట్ చేయడం జరిగిందట..
ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో హీరోగా సిద్ధార్థ్ నటించిన జరిగింది. ఆ సినిమా తర్వాత హీరో సిద్ధార్థ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన బొమ్మరిల్లు సినిమాను చూస్తూనే ఉంటారు వారి అభిమానులు. ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ పాత్రలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ అందరూ వింటూ ఉంటారు. ఇదిలా ఉండగా అప్పట్లో రూ.6 కోట్లు పెట్టి తీసిన ఈ మూవీ దిల్ రాజుకు ఏకంగా రూ.50 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి లాభాలు తెచ్చిపెట్టాయి.ఈ మూవీని మొదట హీరో నవదీప్ కు చెప్పారంట దిల్ రాజు.
అయితే అప్పట్లో నవదీప్ ఇంకా హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. దిల్ రాజు మాత్రం అతన్ని హీరోగా పరిచయం చేస్తూ ఈ మూవీ తీయాలని అనుకున్నాడంట. ఆ సినిమా టైంలో నవదీప్ జై అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నవదీప్ గౌతమ్ ఎస్ ఎస్ సి తదితర సినిమాలను లైన్ లో పెట్టడం జరిగింది. దీనికిగాను నవదీప్ బొమ్మరిల్లు సినిమా వదులుకొనాడట. దీని తరువాత నవదీప్ చాలా బాధపడ్డాడట.ఒకవేళ ఆ మూవీ చేసి ఉంటే.. ఇప్పటికీ హీరోగా కొనసాగేవాడేమో అంటున్నారు సినీ విశ్లేషకులు .అంతేకాదు తరతరాలు గుర్తుండిపోయే సినిమాను వదులుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా మరి…!!