Natural Star Nani: బాక్సాఫీస్ కు ఊపిరి పోసిన నాని

నాని నటించిన ‘హిట్ 3 ది థర్డ్ కేస్’ నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరడం టాలీవుడ్‌కి మంచి బూస్ట్ లాంటిదని చెప్పవచ్చు. ఏ రేటెడ్ సినిమా, ఫ్యామిలీ ప్రేక్షకులను దూరంగా ఉండమని సూచించిన చిత్రం ఇంత వేగంగా ఈ రికార్డ్ ను చేరడం ట్రేడ్ వర్గాలను ఆనందంలో ముంచెత్తింది. వీకెండ్‌లో అర్జున్ సర్కార్ పాత్రతో నాని బాక్సాఫీస్‌ను డామినేట్ చేశాడు. ‘తుడరుమ్’ లాంటి బలమైన టాక్ ఉన్న చిత్రంతో పోటీపడి, నార్త్‌లో భారీ రిలీజ్ ఉన్న ‘రైడ్ 2’ను ఢీకొంటూ బుక్ మై షోలో రికార్డు సంఖ్యలు నమోదు చేయడం నాని మార్కెట్ బలాన్ని చాటుతోంది.

టాలీవుడ్ గత నెల రోజులుగా థియేటర్లలో ప్రేక్షకుల కొరతతో షోలు రద్దవుతూ కష్టాల్లో ఉంది. ఇలాంటి సమయంలో ‘హిట్ 3’ ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టడం ఇండస్ట్రీకి ఊపిరి పోసినట్టైంది. ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్ల మార్క్ దాటడం మరో బోనస్. నాని అమెరికాలో చేస్తున్న ప్రమోషన్ టూర్ ఈ వసూళ్లను మరింత పెంచే అవకాశం ఉంది. ‘దసరా’ కంటే వేగంగా సెంచరీ కొట్టిన ఈ చిత్రానికి నిజమైన సవాలు సోమవారం నుంచి మొదలవనుంది. వీక్‌డేలో డ్రాప్ ఎంత ఉంటుందనేది దాని స్టామినాను నిర్ణయిస్తుంది.

రాబోయే శుక్రవారం శ్రీవిష్ణు సినిమా, సమంత నిర్మించిన ‘శుభం’ వంటి కొత్త రిలీజ్‌లు ఉన్నాయి. వీటి ప్రభావం వాటి టాక్‌పై ఆధారపడి ఉంటుంది. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ హైప్ త్వరగా తగ్గిపోయింది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఏపీలో టికెట్ ధరల పెంపు బుధవారంతో ముగియనుంది, సాధారణ ధరలతో ‘హిట్ 3’ ఊపు కొనసాగాలి. నాని, శ్రీనిధి శెట్టితో కలిసి యుఎస్‌లో ప్రమోషన్స్‌లో బిజీగా ఉండగా, దర్శకుడు శైలేష్ కొలను ఇక్కడ పబ్లిసిటీని కొనసాగిస్తున్నాడు. మరి మిగతా రోజుల్లో కూడా ఇదే ఊపుతో 200 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందో లేదో చూడాలి.

జైలులో కుట్ర | Analyst Ks Prasad Reacts On Brahmins Angry Over PSR Anjaneyulu Arrest | Telugu Rajyam