రామారావు ఆన్ డ్యూటీ థియేటర్స్ లో ప్రేక్షకుల ఈలలు.. సినిమా కోసం అనుకుంటే పొరపాటే..?

రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. జూలై 29వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమా చూడటానికి థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులు మాత్రం ఈలలతో రెచ్చిపోయారు. అయితే ప్రేక్షకులు హీరో కోసం ఈ ఈలలు వేశారు అనుకుంటే మీరు పొరపడినట్లే. ప్రేక్షకులు హీరో కోసం కాకుండా ఈ సినిమాలో నటించిన నరేష్, పవిత్ర లోకేష్ కోసం విజిల్స్ వేస్తూ రెచ్చిపోయారు. ఈ సినిమాలో వీరిద్దరూ అన్నా చెల్లెలు పాత్రలో నటించారు. దీంతో థియేటర్లో వీరిని చూడగానే ప్రేక్షకులు ఈలల వేస్తూ రచ్చ చేశారు.

కొంతకాలంగా వీరిద్దరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచారు. వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎన్నో కథనాలు వెలువడ్డాయి. నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరు కలిసి ఓ దేవాలయానికి వెళ్లి స్వామీజీని దర్శించుకోవడంతో ఈ రచ్చ మొదలైంది. వీరిద్దరూ ఇలా జంటగా కలిసి వెళ్లడంతో ఇద్దరికీ వివాహం అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన వీరిద్దరూ తాము వివాహం చేసుకోలేదని కాకపోతే గత నాలుగేళ్లుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నామని ప్రకటించారు. దీంతో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి రంగంలోకి దిగి తనకి చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా నరేష్ పవిత్రని పెళ్ళి చేసుకున్నాడని ఆరోపించింది. అంతే కాకుండా మైసూర్ లోని ఒక హోటల్ గదిలో కలిసి ఉన్న నరేశ్, పవిత్ర లోకేష్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

ఇంతకాలం అమ్మ, అత్త, వదిన, పిన్ని వంటి పాత్రలలో ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపించిన పవిత్ర పై ప్రేక్షకులకు మంచి అబిప్రాయం ఉండేది. కానీ నరేశ్ పవిత్ర మధ్య ఉన్న సంబంధం తెలిసిన తర్వత ప్రేక్షకులలో వీరి మీద ఉన్న అభిప్రాయం మారిపోయింది. అంతే కాకుండా గతంలో పవిత్ర తన ఇద్దరు భర్త లను విడిచిపెట్టి ఈ వయసులో నరేశ్ తో సహజీవనం చేస్తోంది. దీంతో ఇటీవల విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ సినిమా లో వీరిద్దరూ కనిపించటం తో ప్రేక్షకులు ఈలలు వేస్తూ రెచ్చిపోయారు. అంతే కాకుండా ఈ క్రేజీ కపుల్ ఈ సినిమాలో అన్న చెల్లెలి పాత్రలలో నటించారు. దీంతో వీరిని అన్న చెల్లెలి గా చూపించడంతో డైరెక్టర్ పై ప్రేక్షకులు సెటైర్లు వేస్తున్నారు.