2024లోనూ నాని పర్ఫెక్ట్‌ ప్లానింగ్‌ …!

2024లోనూ పర్ఫెక్ట్‌ ప్లానింగ్‌ తో ఎవరెలా ఉన్నా నా పని నేను చేసుకుంటా అనే హీరో నాని. హిట్టు ఫ్లాపులతో ఈయనకు పనిలేదు.. వరస లు చేసామా లేదా అనేది మాత్రమే చూస్తుంటారు న్యాచురల్‌ స్టార్‌. దానికితోడు 2023 మాంచి బూస్టప్‌ ఇవ్వడంతో 2024ను మరింత గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారీయన. మరింతకీ న్యూ ఇయర్‌లో నాని ప్లానింగ్‌ ఏంటి..?

ఈ ఏడాది ఎన్ని సినిమాలతో రాబోతున్నారు..? 2017 తర్వాత నానికి అంత బాగా కలిసొచ్చింది గతేడాదే. 2023 మొదట్లో ‘దసరా..’ చివర్లో ‘హాయ్‌ నాన్న’తో మాస్‌ క్లాస్‌ విజయాలు అందుకున్నారు నాని. ఈ రెండు సినిమాలు కలిపి దాదాపు 170 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసాయి. దసరాకు 65 కోట్ల షేర్‌ వస్తే.. హాయ్‌ నాన్న దాదాపు 40 కోట్ల వరకు వసూలు చేసింది.

ఇదే దూకుడు 2024లోనూ కొనసాగించాలని చూస్తున్నారు నాని. నాని ప్రస్తుతం వివేక్‌ ఆత్రేయ తెరకెక్కిస్తున్న సరిపోదా శనివారం తో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను మార్చ్‌లోపు పూర్తి చేసి సమ్మర్‌ రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. అంటే సుందరానికి ఫ్లాప్‌ అయినా వివేక్‌పై నమ్మకంతో మరో ఛాన్స్‌ ఇచ్చారు నాని.

సరిపోదా శనివారం పూర్తిగా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది. ఇందులో గ్యాంగ్‌ లీడర్‌ ఫేమ్‌ ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సరిపోదా శనివారం పూర్తి కాగానే హిట్‌ 3ని లైన్‌లోకి తీసుకురానున్నారు నాని. దీనికి ఆయనే నిర్మాత. 2024లోనే హిట్‌ 3 ఉంటుందని దర్శకుడు శైలేష్‌ కొలను కూడా కన్ఫర్మ్‌ చేసారు.

అన్నీ కుదిర్తే హిట్‌ 3తో పాటు మరో ను 2024లో విడుదల చేయాలనేది నాని ప్లాన్‌. 2017లో ఇలాగే 3 లతో వచ్చి హిట్స్‌ కొట్టారు న్యాచురల్‌ స్టార్‌. మరి మరోసారి ఇదే మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తారా లేదా అనేది చూడాలిక!!