The Paradise: నాని ‘ప్యారడైజ్’.. షూటింగ్ మొదలవ్వకముందే 18 కోట్ల ఆఫర్!

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న “ది ప్యారడైజ్” సినిమా ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వకముందే మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ సంస్థ సరిగమ దక్కించుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రూ.18 కోట్ల భారీ మొత్తం చెల్లించి ఆ హక్కులను సొంతం చేసుకోవడం మ్యూజిక్ ఇండస్ట్రీలోనే ఓ రికార్డుగా భావిస్తున్నారు.

నాని, అనిరుధ్ రవిచందర్ కాంబినేషన్‌పై ఇప్పటికే మ్యూజిక్ లవర్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’ వంటి చిత్రాల్లో ఈ కలయిక ఆకట్టుకున్న తీరు మరింత హైప్‌ను పెంచింది. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’తో ఈ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో, పాటల విషయంలో ఎలాంటి హై స్టాండర్డ్ ఉంటుంది అన్న అంచనాలు మొదలయ్యాయి. టీజర్‌లోనే కంటెంట్ బోల్డ్‌గా ఉండబోతుందని స్పష్టమవడంతో, మార్కెట్ అంచనాలు ముందే పెరిగిపోయాయి.

మార్చి 26న విడుదల కానున్న ఈ చిత్రం, రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో పోటీ పడనుంది. అయితే వాయిదా అనే ఆలోచన కూడా చేయకుండా నాని ముందుకెళ్లే నిర్ణయం తీసుకున్నారు. వరుస విజయాలతో నాని మార్కెట్ విస్తరిస్తుండగా, ‘ది ప్యారడైజ్’ ఆడియో డీల్‌తో మరోసారి అతని బిజినెస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో రుజువైంది. త్వరలో మ్యూజిక్ వర్క్ ప్రారంభమయ్యే అవకాశం ఉండగా, రెగ్యులర్ షూట్ ప్రారంభమైన తర్వాత మరిన్ని అప్డేట్లు ప్రేక్షకులను చేరనున్నాయి.