నాని హీరోయిన్ కి లక్ లేదనుకున్నారు.. ఇదేంటి మరి ..?

నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అన్న టాక్ తో నిలిచిపోయింది. టాలెంటెడ్ డైరెక్టర్ విక్రం కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో టాలీవుడ్ కి ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా పరిచయం అయింది. చాలా సింపుల్ గా కనిపించిన ప్రియాంక గ్యాంగ్ లీడర్ ప్రమోషన్స్ లో నాని బాగా హైప్ ఇచ్చాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుందని నమ్మకంగా చెప్పాడు. అయితే ఈ సినిమా అనుకున్నంత సక్సస్ ని అందుకోకపోవడంతో ఇక ప్రియాంక టాలీవుడ్ లో కనిపించదని కామెంట్ చేశారు.

Nani Stills With Heroine Priyanka Mohan And Villain Kartikeya At Gand  Leader Press Meet - Social News XYZ

అంతేకాదు ఈ బ్యూటికీ టాలీవుడ్ లో లక్ లేదని అన్నారు. అందం, అభినయం ఉన్నాడా కూడా గ్యాంగ్ లీడర్ సినిమా రిజల్ట్ ఈ బ్యూటీకి బాగా దెబ్బకొట్టిందని అనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ప్రియాంక అకౌంట్ లో వరసగా సినిమా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే ప్రియాంక అరుల్ .. శర్వానంద్ నటిస్తున్న శ్రీకారం అన్న సినిమాలో హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ భలేగుంది బాలా ‘ అన్న సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేశారు. ఈ ప్రోమో లో ప్రియాంక క్యూట్ లుక్స్ అదిరిపోయాయి.

Priyanka Arul Mohan Hot Bold scenes with Nithin • AgraTara

ఇక ఈ సాంగ్ ని ఈ నెల 9 వ తారీఖున రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు. కాగా ప్రియాంక కి మరోసారి విక్రం కుమార్ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దిల్ రాజు నిర్మాతగా అక్కినేని నాగ చైతన్య – విక్రం కుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాకి ‘ థ్యాంక్యూ ‘ అన్న టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ ని హీరోయిన్ గా ఎంచుకున్నారట. శ్రీకారం తో పాటు, థ్యాంక్యూ కూడా సూపర్ హిట్ అయితే ఇక నాని చెప్పినట్టు ప్రియాంక టాలీవుడ్ లో పక్కా హీరోయిన్ గా సెటిలయినట్టే.

Sreekaram - Bhalegundi Baalaa Song Promo | Sharwanand | Kishore B | Mickey J. Meyer