దసరా ఒటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. ఈ మూవీ గత నెలలో ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొంది. ఇక నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఏకంగా వంద కోట్లకి పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకొంది. అలాగే ఈ మూవీతో నాని ఖాతాలో వంద కోట్ల క్లబ్ రికార్డ్ చేరింది.

నిర్మాతకి ఈ మూవీ భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అయితే పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేసిన ఇతర భాషలలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి చేరువ కాలేదు. ఇక తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ పీరియాడికల్ రియలిస్టిక్ స్టొరీకి తెలుగు ఆడియన్స్ అయితే విపరీతంగా కనెక్ట్ అయిపోయారు.

నైజాంలో అయితే దిల్ రాజుకి భారీ లాభాలే తీసుకొచ్చింది. ఇక నాని రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్, కీర్తి సురేష్ మెస్మరైజింగ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. కంటెంట్ కూడా భాగా కనెక్ట్ కావడంతో తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా డిజిటల్ రిలీజ్ డేట్ ని నెట్ ఫ్లిక్స్ కన్ఫర్మ్ చేసింది.

ఏప్రిల్ 27న ఈ మూవీ ఒటీటీ స్ట్రీమింగ్ ఉంటుందని తెలిపారు. థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా అన్ని భాషలలో నెట్ ఫ్లిక్స్ ఏప్రిల్ 27 నుంచి అందుబాటులో ఉంచనుంది. మరి డిజిటల్ లో ఈ మూవీ ఏ మేరకు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందనేది వేచి చూడాలి. ఇక దసరా మూవీ బ్లాక్ బస్టర్ ఎఫెక్ట్ తో నాని నెక్స్ట్ మూవీకి డిమాండ్ పెరిగింది.

శౌర్యువ్ దర్శకత్వంలో ప్రస్తుతం నాని చేస్తోన్న షూటింగ్ జరుగుతోంది. మృణాల్ ఠాకూర్ ఈ మూవీ నానికి జోడీగా నటిస్తోంది. ఇక ఈ మూవీ ఆడియో రైట్స్ 7 కోట్లకి టి-సిరీస్ సొంతం చేసుకుందంట. అలాగే డిజిటల్ రైట్స్ కూడా 30 కోట్లకి అమ్ముడైపోయినట్లు ఇండస్ట్రీ వర్గాల మాట