భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన దసరా పాన్ ఇండియా లెవెల్లో గట్టిగానే రిలీజ్ కాబోతోంది. నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 30న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా జోరందుకున్నాయి. ఐదు భాషల్లో ఒకేసారి విడుదల అవుతోంది. ఈ చిత్రం తెలంగాణ నేపథ్యంలో సాగుతుందని ముందే క్లారిటీ ఇచ్చారు.
ఇక ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరైన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా మరికొందరు ప్రముఖ నటీనటులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఈ చిత్రం తెలుగులో మంచి వసూళ్లను సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ హిందీ, తమిళం రెండింటిలోనూ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. హిందీలో, తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన అజయ్ దేవగన్ ఖైదీ రీమేక్ అదే రోజున విడుదల కానుంది. ఈ చిత్రం ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. దానిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. తమిళంలో, దసరాతో పాటు మరో రెండు సినిమాలు పోటీ పడనున్నాయి. వాటిలో శింబు నటించిన పాతుతాల ఒకటి కాగా, సూరి – విజయ్ సేతుపతి నటించిన విడుతలై 1 మరొకటి.
ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి తమిళనాడులో నాని దసరా ప్రభావం చూపడం కష్టమవుతుంది. ఓవరాల్‌గా, దసరా సాంగ్స్ తో హైప్ క్రియేట్ చేస్తున్నప్పటికీ ఇది విడుదల చేస్తున్న మూడు భాషలలో గట్టి పోటీని ఎదుర్కొంటుంది. మరి ఆ సినిమాలను ఎదుర్కొని బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.