Nani : దసరా గా రాబోతున్న నాని, నాటు నాటు పాట కొరియోగ్రాఫర్ తో ఊర మాస్ పాట….!

Nani : విభిన్న కథాంశాలతో సినిమాలు తీస్తూ తన మార్కెట్ ను ప్రేక్షకులను పెంచుకుంటూ పోతున్న హీరో మన నేచురల్ స్టార్ నాని. అయితే కామెడీ, లేదా యాక్షన్,లేకపోతే జెర్సీ లాంటి ఎమోషనల్ డ్రామా లేకపోతే శ్యామ్ సింగ్ రాయ్ లాంటి క్లాసిక్ సినిమా. ఇలా ప్రతి జోనర్ టచ్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్న నాని తాజాగా ‘శ్యామ్ సింగ్ రాయ్’ తో పలకరించారు. ఇక ఎపుడు ‘అంటే సుందరానికి’ అంటూ వచ్చేస్తున్నాడు.

ఇక నాని మరో సినిమా కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అదే ‘దసరా ‘ పండగ కాదండోయ్ అది నాని కొత్త సినిమా టైటిల్. సినిమా పోస్టర్ చూస్తే పుష్ప సినిమా వాసనా తగులుతోంది.ఊర మాస్ లుక్ లో నాని దర్శనమిస్తున్నాడు. మొన్నే కదా క్లాస్ గా శ్యామ్ సింగ్ రాయ్ అయ్యాడు. అపుడే ఊర మాస్ గెటప్ లోకి మారిపోయి ఫ్యాన్స్ ను ఆశ్చర్య పరుస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘దసరా’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.నాని సరసన కీర్తి సురేష్ కథానాయికగా మరోసారి నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానుంది. హీరో నాని తొలి పాన్ ఇండియా చిత్రమిది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన చిత్ర గ్లింప్స్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే.

బీడీ వెలిగిస్తూ ఊర మాస్ లుక్ లో ఉన్న నాని పోస్టర్ ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తెలంగాణ, పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనిలో జరుగుతుంది. చిత్రీకరణలో భాగంగా నాని, కీర్తి సురేష్‌పై భారీ స్థాయిలో పాటని షూట్ చేస్తున్నారు. నాటు నాటు పాట కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. దాదాపు 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటని గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారని ప్రేక్షకులని అలరించడమే లక్ష్యంగా మండు వేసవిని సైతం లెక్క చేయకుండా ఈ పాట కోసం చిత్ర యూనిట్ కష్టపడి పనిచేస్తుందని మేకర్స్ తెలుపుతున్నారు. నాని పూర్తి మాస్, యాక్షన్ పాత్రలో నాని కనిపిస్తున్న ఈ చిత్రం గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్‌ దగ్గర ఉన్న ఒక గ్రామం నేపథ్యంలో నడుస్తుంది. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు.