‘దసరా’.. ఈ బజ్ సరిపోదుగానీ.!

నాని హీరోగా తెరకెక్కిన ‘దసరా’ సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చి 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్.

గట్టిగా వారం రోజులు కూడా సమయం లేదు సినిమా రిలీజ్‌కి.! కానీ, ఇంతవరకు సినిమాకి సరైన బజ్ కనిపించడంలేదు. తెలుగులో నాని సినిమాకి వుండాల్సినంత బజ్ అయితే వుంది. కానీ, అది సరిపోదు.

ఎందుకంటే, నాని నుంచి వస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. తెలుగుతోపాటు, ఇతర భాషల్లోనూ బజ్ క్రియేట్ అయి వుండాలి. తెలుగు రాష్ట్రాల్లోనే బజ్ అంతంతమాత్రంగా వుంది.

ఆ మాటకొస్తే, సోషల్ మీడియాలో ‘దసరా’ హ్యాష్ ట్యాగ్స్ కూడా పెద్దగా ట్రెండింగ్‌లోకి రావడంలేదు. నాని మాటలైతే గట్టిగా చెబుతున్నాడుగానీ, పబ్లిసిటీ విషయంలో నిర్మాతల్ని తగినంతగా ముందుకు తోయడంలేదేమో.!