Nani: ఆవకాయ సీజన్ కి వస్తున్న ‘అంటే సుందరానికి’..?

Nani: నాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయి సినిమా విజయం తర్వాత వస్తున్న సినిమా’ అంటే.. సుందరానికి’. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాబోతోంది. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాను నవీన్ యెర్నేని ఇంకా అలాగే యలమంచిలి రవిశంకర్  నిర్మిస్తున్నారు.

మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ ఫహాద్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ఇది నజ్రియాకు ఫస్ట్ తెలుగు డెబ్యూ మూవీ.ఈ సినిమాలో నరేష్ – రోహిణి – శ్రీకాంత్ అయ్యంగార్ – నదియా – హర్షవర్ధన్ – రాహుల్ రామకృష్ణ – సుహాస్ – పృథ్వీరాజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. రవితేజ గిరిజాల ఈ సినిమాకి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. లతా నాయుడు ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ నదియాకు తెలుగులో మొదటి సినిమా అయినప్పటికీ తన పాత్రకు తనే డబ్బింగ్ కూడా చెప్పుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి నాని ఫస్ట్ లుక్, హీరోయిన్ ఫస్ట్ లుక్, బర్త్డే హోమం టీజర్ ఇలాంటి విడుదల చేయడం వలన ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. తాజాగా ఉగాది పండుగను పురస్కరించుకొని సందర్భంగా మేకర్స్ ఓ పోస్టర్ వదులుతూ సరికొత్త అప్డేట్ ఇచ్చారు.

అంటే.. సుందరానికీ!’ సినిమా నుంచి ‘పంచెకట్టు’ అనే ఫస్ట్ సింగిల్ ని ఏప్రిల్ 6 వ తేదీన సాయంత్రం గం. 6:03 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ అనౌన్స్మెంట్ పోస్టర్లో నాని అమెరికాలో ఓ కారులో ప్రయాణిస్తూ ఇంకా అలాగే ఎంతో ఎగ్జైటింగ్ గా బయటకు చూస్తూ కనిపిస్తున్నాడు. నాని సినిమాలు బ్రాహ్మణ యువకుడు గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ కూడా సినిమా మీద అంచనాలు పెంచుతోంది. ఈ సినిమా నాని కెరీర్లో ఒక మంచి విజయాన్ని అందిస్తుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.