కన్నడ స్టార్‌ శివరాజ్‌కుమార్‌ ఇంటికి వెళ్లిన నాని

టాలీవుడ్‌ మూవీ లవర్స్‌తోపాటు నాని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హాయ్‌ నాన్న’. శౌర్యువ్‌ (డెబ్యూ డైరెక్టర్‌) డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రంలో న్యాచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్నారు. నాని 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘హాయ్‌ నాన్న’ డిసెంబర్‌ 7న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతున్న నేపథ్యంలో నాని అండ్‌ టీం ఇప్పటికే ప్రమోషన్స్‌ లో ఫుల్‌ బిజీగా ఉన్నారు.

ఇప్పటికే అభిమానులతో సెషన్‌లో కూడా పాల్గొన్న నాని పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రమోషనల్‌ యాక్టివిటీస్‌పై ఫోకస్‌ పెట్టాడు నాని. ఇందులో భాగంగానే కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌ ఇంటికెళ్లాడు. ఈ ఇద్దరూ బ్రేక్‌ ఫాస్ట్‌ టైంలో ‘హాయ్‌ నాన్న’ సినిమాలతోపాటు పలు విషయాలపై చర్చించారు. ఇప్పుడీ స్టిల్స్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.

తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగనున్న ఈ మూవీలో బేబి కియారా ఖన్నా నాని కూతురుగా నటిస్తోంది. ఇప్పటికే ‘హాయ్‌ నాన్న’ నుంచి లాంఛ్‌ చేసిన టైటిల్‌ గ్లింప్స్‌, టీజర్‌, సాంగ్స్‌ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఈ మూవీ ఫస్ట్‌ సింగిల్‌ సమయమా సాంగ్‌ మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌ రాబడుతూ.. మ్యూజిక్‌ లవర్స్‌ను ఫుల్‌ ఇంప్రెస్‌ చేస్తోంది.

ఈ చిత్రానికి మలయాళం కంపోజర్‌, హృదయం ఫేం హేశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ తెరకెక్కిస్తున్నారు.