శ్యామ్ సింగ రాయ్ తో నేనేంటో చూపిస్తా.. అంటున్న నాని ..?

వరసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ వచ్చినా కూడా రెండు ఫ్లాపులొస్తే మాత్రం ఆ హీరో మీద ఫ్లాప్ సినిమాల ప్రభావం గట్టిగా పడుతుంది. అన్ని లెక్కలు మారిపోతాయి. రెమ్యూనరేషన్ విషయంలో.. సినిమా బడ్జెట్ విషయం లో నిర్మాతలు చాలా డిస్కర్షన్స్ పెడతారు. ఇది తప్పు కాదు .. ఇక్కడ ఎవరికైనా సక్సస్ ఇంపార్టెంట్. ఒక్క ఫ్లాప్ కొన్ని జీవితాలని తారుమారు చేస్తుంది. అదే ఇప్పుడు నాని సినిమా విషయంలో జరిగిందని అంటున్నారు.

Nani shares first glimpse of his upcoming film Shyam Singha Roy with Sai  Pallavi; See Pic | PINKVILLA

వాస్తవంగా వి సినిమా భారీ కమర్షియల్ హిట్ కాకపోయినప్పటికి నాని మాత్రం సినిమాని బాగానే లాక్కొచ్చాడు. కాని నిరాశ తప్పలేదు. ఆ ప్రభావం లేక ఇంకేదైనా కారణమా తెలీదు గాని ప్రస్తుతం నాని కమిటయిన శ్యామ్ సింగ రాయ్ సినిమాకి నిర్మాత మారాడు. కారణాలు రక రకాలని చెప్పుకుంటున్నారు.

‘వి’ సినిమా రిలీజయ్యాక.. టక్ జగదీష్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు నాని. కాగా పునర్జన్మల నేపథ్యంలో నాని నటించబోతున్న శ్యామ్ సింగ రాయ్ స్క్రిప్టు కి ఓవర్ బడ్జెట్ కారణంగానే నిర్మాత తప్పుకున్నాడని అంటున్నారు. కాని నాని మాత్రం స్క్రిప్ట్ ప్రకారం అనుకున్న బడ్జెట్ పెట్టాల్సిందే అన్న మాట నిర్మాత దగ్గర ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ కి నిర్మాత మారాల్సి వచ్చిందని సమాచారం.

అయితే ఈ స్క్రిప్టుతో బ్లాక్ బస్టర్ అందుకొని చూపిస్తానని నాని తన సన్నిహిత వర్గాల దగ్గర అంటున్నట్టు చెప్పుకుంటున్నారు. అందరికీ కావాల్సింది కూడా అదే. గత కొంతకాలంగా నాని నుంచి భారీ సక్సస్ కావాలనుకుంటున్న అభిమానులకి నిరాశ మిగులుతుంది. నిజంగా ఈ సినిమాతో నాని భారీ సక్సస్ కొడితే మాత్రం మళ్ళీ నాని రేస్ లోకి వచ్చినట్టే. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి- కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్నాడు.