విడుదలకి ముందే V సినిమా విషయం లో వాళ్ళంతా భయపడుతున్నారు .. ఎందుకో ?

Nani V movie to release on september 5 on amazon prime

మొట్టమొదటి సారి నాని వి సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నది. సెప్టెంబర్ 5 న సినిమా విడుదల కానుంది. ఇక.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మొదటి సారి పెద్ద సినిమా ఓటీటీలో రిలీజ్ కావడం ఇదే ప్రథమం. అందుకే సినీ ప్రేక్షకులు కూడా సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Nani V movie to release on september 5 on amazon prime
Nani V movie to release on september 5 on amazon prime

అయితే.. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు సక్సెస్ అవుతాయా? లేదా? అనే టెన్షన్ ఇప్పుడు వి సినిమా బృందానికి పట్టుకున్నదట. ఇంత పెద్ద సినిమా ఇప్పటి వరకు ఓటీటీలో రిలీజ్ అయింది లేదు. అమెజాన్ ప్రైమ్ లో మొదటిసారి రిలీజ్ చేస్తున్నాం. పెట్టుబడికి తగిన ప్రతిఫలం లభిస్తుందా? లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మామూలుగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల బడ్జెట్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ.. ఇది భారీ స్థాయి సినిమా కావడం.. సినిమా కోసం కోట్లు ఖర్చు పెట్టడంతో మూవీ యూనిట్ లో కాస్త ఆందోళన పెరిగిందట.

మూవీ యూనిట్ తో పాటుగా అమెజాన్ ప్రైమ్ కూడా కాస్త సందిగ్దంలో పడిందట. ఎందుకంటే.. అమెజాన్ ప్రైమ్ వి సినిమా కోసం 32 కోట్లు వెచ్చించింది. 32 కోట్ల పెట్టుబడి పెట్టినప్పుడు ఆ సినిమాకు అన్ని వ్యూస్ వస్తాయా? లేదా? సబ్ స్క్రిప్షన్లు పెరుగుతాయా? లేదా? అన్న మీమాంస ప్రైమ్ లో ఉంది.

బాలీవుడ్ సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో రిలీజ్ అయినా..వాటికి వచ్చే వ్యూస్ ఎక్కువ. ఎందుకంటే.. బాలీవుడ్ కు రీచ్ ఎక్కువ. మరి.. టాలీవుడ్ కు ఎంత రీచ్ ఉంది. ఓటీటీల్లో సినిమా రిలీజ్ అయితే పెద్ద ఎత్తున వ్యూస్ వస్తే.. సబ్ స్క్రిప్షన్లు పెరిగితే.. టాలీవుడ్ కూడా ఇక.. ఓటీటీలవైపు ఎక్కువగా స్టెప్స్ వేస్తుంది. ఓటీటీల దృష్టిని ఆకర్షిస్తుంది. 

అందుకే వి సినిమాకు వచ్చే రెస్పాన్స్ బట్టి.. ఓటీటీలు తెలుగు సినిమా కోసం పెట్టుబడులు పెట్టడం, వేరు సినిమా డీల్స్ అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. తెలుగు నిర్మాతలు కూడా ఓటీటీల్లో రీచ్ పెరిగితే తక్కువ బడ్జెట్ తో అయినా సినిమాలు తీసి ఓటీటీల్లో రిలీజ్ చేసుకునే అవకాశం ఉంది. థియేటర్లు తెరుచుకోకున్నా… ఓటీటీ ద్వారా అయినా ప్రేక్షకులకు సరికొత్త సినిమాలను అందించే అవకాశం ఉంది. చూద్దాం.. సెప్టెంబర్ 5న రిలీజ్ అయ్యే వి సినిమాతో అందరి జాతకాలు బయటపడనున్నాయి. ఈ సినిమా ఇప్పుడు ఓవైపు మూవీ యూనిట్ కు, మరోవైపు ఓటీటీకి పెద్ద చాలెంజ్.