Nani : జెర్సీ సినిమాకు మూడేళ్లు… అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన నాని…!

Nani : నాని ప్రతి సినిమాతో తన అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. విభిన్నమైన పాత్రాలను ఎంచుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇటీవలే శ్యామ్ సింగ్ రాయ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాని ఇపుడు అంటే సుందరానికి అంటూ వస్తున్నాడు. ఇక ఈ సినిమా పూర్తి వైవిద్య భరితంగా వినోదాత్మకంగా ఉండబోతోంది. ఒక సినిమాతో మరొక సినిమాకు సంబంధం లేకుండా కథలను ఎంచుకుంటాడు నాని. ఇక నాని సినిమా కెరీర్ లో జెర్సీ సినిమాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాని నటన అద్భుతమనే చెప్పాలి. క్రికెట్ ఆటగాడి జీవితం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాని నటన, నాని కి జోడిగా నటించిన శ్రద్ధ శ్రీనాథ్ నటన అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా విడుదలయి మూడేళ్లు పూర్తి అయిన సందర్బంగా నాని సినిమాకు సంబంధించిన తొలగించిన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.

అర్జున్ మళ్లీ క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్న సమయంలో అతని భార్య సారా తండ్రి వచ్చి అతనికి జాబ్ లో తిరిగి చేరేందుకు కావాల్సిన డబ్బు ఇచ్చి క్రికెట్ ఆపేయమని చెబుతాడు. వాస్తవంలో బ్రతకమని చెబుతాడు. చాలా అద్భుతంగా ఉన్న ఈ సీన్ ఇన్నాళ్లు ఎందుకు రిలీజ్ చేయలేదో కానీ జెర్సీ అభిమానులకు కి ఈ సన్నివేశం చాలా బాగా నచ్చింది. ఇక ఈ సినిమా ను ఇపుడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నారు త్వరలోనే ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది.