నాని లుక్ అదుర్స్…’శ్యామ్ సింగరాయ్’ ఫస్ట్‌ లుక్ విడుదల !

టాక్సీవాలా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. మొదటి సినిమాలోనే శరీరం నుండి ఆత్మ బయటికి వచ్చే సూపర్ సబ్జెక్టుతో సినిమా తీసిన రాహుల్ అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు. రెండో సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ కోసం కూడా రాహుల్ ఓ సరికొత్త కథను రాశాడని ఫిలిం వర్గాలలో ప్రచారం జరుగుతోంది.

ఇక నాని పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను నాని తన ట్వీటర్ ద్వారా విడుదల చేశారు. పేరు శ్యామ్ పూర్తి పేరు శ్యామ్ సింగరాయ్ అంటూ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌లో నాని జేబుల్లో చేతులు పెట్టుకొని నించొని ఉంటే వెనుక నుంచి హీరోయిన్ కౌగిలించుకొని ఉన్నారు. ఈ ఫస్ట్‌లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్తుంది.

నాచురల్ స్టార్ నాని ఈ సినిమాలో డబల్ రోల్ చేయనున్నట్లు సమాచారం. పునర్జన్మల నేపథ్యంలో ప్రేమ కథగా ఈ సినిమా ఉండనుంది. హైదరాబాద్ లో జరిగే ప్రేమ కథలో శ్యామ్ గా, కోలకతాలో జరిగే ప్రేమ కథలో సింగరాయ్ గా నాని నటిస్తున్నాడని సమాచారం. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ గత కొద్దీ రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నాని సరసన నాచురల్ బ్యూటీ సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.